వామ్మో... మేకప్ వేస్తే మనిషే మారిపోతున్నాడు
సాధారణంగా మేకప్ వేసుకుంటే ఉన్న ముఖం మరింత అందంగా తయారవుతుంది. కానీ యూకెలోని మాంచెస్టర్‌కు చెందిన అలెక్సిస్ స్టోన్ అనే యువకుడు మేకప్ వేసుకుంటే మాత్రం ఉన్న ముఖం మాయమై మరొకరి ముఖం ప్రత్యక్షమవుతుంది. విచిత్రంగా
ఇంటర్నెట్ డెస్క్: మేకప్.. ముఖానికి మరింత అందం తెస్తుంది. కానీ యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన అలెక్సిస్ స్టోన్ అనే యువకుడు మేకప్ వేసుకుంటే మాత్రం ఉన్న ముఖం మాయమై మరొకరి ముఖం ప్రత్యక్షమవుతోంది. ఆశ్చర్యంగా ఉందా..! అందులో మాయ లేదు.. మంత్రం లేదు. అంతా అలెక్సిస్ మేకప్ నైపుణ్యం. చాలాకాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న అలెక్సిస్.. మేకప్‌తో తన ముఖాన్ని హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు, సినిమా పాత్రల ముఖంగా మార్చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. దీంతో అతడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.
ఇప్పటివరకు అలెక్సిస్ తన ముఖాన్ని మేకప్ సాయంతో హాలీవుడ్ నటులు లియానార్డో డికాప్రియో, జానీ డెప్, పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కిమ్ కర్దాషియన్, హోం ఎలోన్ చిత్రంలోని నటుడు కెవిన్, హ్యారీ పోటర్ చిత్రంలోని డంబుల్‌డోర్, పోప్ ఫ్రాన్సిస్, జుకర్‌బర్గ్ ఇలా అనేక రూపాలుగా మార్చేశాడు. ప్రస్తుతం అలెక్సిస్‌కి ఇన్‌స్టాలో 8 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. మొదట్లో అతడి ఫొటోలు చూసి నెటిజన్లు కంప్యూటర్‌లో మార్ఫింగ్ చేస్తున్నాడని భావించారట. ఆ తర్వాత తను మేకప్ వేసుకుంటున్న వీడియోలనూ సోషల్ మీడియాలో పెడుతుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరూ అతడి నైపుణ్యాన్ని ఓ సారి చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం