Published : 10/11/2021 13:35 IST

Library: చీకట్లో చదివించే గ్రంథాలయం!

లోపలికెళితే  విస్మయం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మేం చదువుకునే రోజుల్లో ఇంట్లో విద్యుత్‌ ఏర్పాటు చేసుకునే స్థోమత లేక చీకట్లో కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకునేవాళ్లం.. రాత్రయితే వీది దీపాల కింద కూర్చొని చదువుకునేవాళ్లం’ అని తాతలు, బామ్మలు చెబుతుంటారు. నిజమే.. ఇప్పుడంటే విద్యుత్‌ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రాత్రులు చీకట్లో చిన్నపాటి వెలుతురుతో ఎలా చదువుకునేవారో అనిపిస్తుంటుంది. అయితే, ఈ ఆలోచనే వచ్చినట్టుంది తైవాన్‌లోని ఓ బుక్‌షాపు యాజమాన్యానికి. తమ షాపును చిమ్మచీకటిగా మార్చి.. కేవలం పుస్తకాల వద్ద వెలుతురు వచ్చేలా నిర్వాహకులు చిన్నలైట్లను ఏర్పాట్లు చేశారు. బుక్‌షాపులందు తమ షాపు వేరయా.. అనిపించుకుంటున్నారు.

తైవాన్‌లోని కవొసింగ్‌ ప్రాంతంలోని ఫియర్‌-2 ఆర్ట్‌ సెంటర్‌లో ‘వుగాన్‌ బుక్స్‌’ అనే పుస్తకాల అంగడి ఉంది. ఈ షాపు లోపల మొత్తం చీకటి. అయితే, ఇందులో ఏర్పాటు చేసిన అరల్లో 400కుపైగా పుస్తకాలు ప్రదర్శనకు పెట్టారు. ఆ పుస్తకాల పైన చిన్న లైట్‌ను ఏర్పాటు చేశారు. దాని వెలుతురులో కేవలం పుస్తకంపై ఉన్న పేరు మాత్రమే కనిపిస్తుంటుంది. అలా అన్ని పుస్తకాలకు చిన్న లైట్లను ఏర్పాటు చేశారు. ఆ చీకట్లో పుస్తకాలను దూరం నుంచి చూస్తే అవి గాల్లో తేలుతున్నాయా?అన్నట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని టేబుళ్లు.. వాటిపై తక్కువ వెలుతురు ఇచ్చే లైట్లను పెట్టారు. సందర్శకులు, కొనుగోలుదారులు ఈ చీకట్లోనే నడుస్తూ.. పుస్తకాలను తీసుకోవాలి. చదువుకోవాలనుకుంటే షాపు నిర్వాహకులు ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద తక్కువ వెలుతురులో చదువుకోవచ్చు. సందర్శకులు, కొనుగోలుదారులు ఈ వినూత్న అనుభూతిని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులో ఫోన్ టార్చ్‌లైట్ ఆన్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. భలే ఉంది కదా ఆలోచన..!

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని