Published : 03/08/2021 01:14 IST

Duck: ఈ బాతు ఈకలు బంగారంతో సమానం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం.. అరుదు.. అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్‌ పోలార్‌ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి తీసిన 800 గ్రాముల ఈకల ధర మార్కెట్‌లో రూ.3.71లక్షలు పలుకుతోంది. 

ఎందుకంత ధర?

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్‌ ఈ బాతు ఈకల్లోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా తేలికైనవిగా ఉండటంతోపాటు శరీరానికి ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. దీంతో ఖరీదైన దుస్తులు, బ్యాగులు, ఇతర వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బాతు ఈకలను సేకరించడం మొదలుపెట్టాయి. అలా వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఒక్కో బాతు నుంచి అతి స్వల్ప మొత్తంలోనే ఈకలు లభిస్తాయి. అందుకే, ఎంత వీలైతే అంత ఎక్కువ ఈకలు సేకరించడం కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికైనా ముందుకొస్తున్నాయి.

స్థానికులకు ఉపాధి..

ఈడర్‌ పోలార్‌ బాతుల ఈకలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి ఆదాయ వనరులా మారింది. వారంతా ఈకలను సేకరించి కంపెనీలకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా బాతులు గుడ్లు పెట్టి పొదిగే సమయంలో ఈకలు రాలి కిందపడుతుంటాయి. వాటిని సేకరిస్తుంటారు. ఒక కిలో ఈకలను సేకరించాలంటే దాదాపు 60 బాతులు అవసరం. అయితే ఒకవేళ బాతులు వారికంట పడినా వాటికి హాని తలపెట్టరు. ఈకలు సేకరించిన తర్వాత బాతును వదిలేస్తారు. కొన్నాళ్లకు బాతుకు మళ్లీ ఈకలు వస్తాయి. ఇలా ఏడాదిలో మూడుసార్లు ఈకల సేకరణ వారికి ఓ ఉపాధిలో మారుతోంది.  

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్