Xi Jinping: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి.. ఏడేళ్లు గుహలోనే నివసించి.. ఇదీ జిన్‌పింగ్ ప్రస్థానం!
చైనా (China) అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన షి జిన్‌పింగ్ (Xi Jinping).. పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. పార్టీలో కీలక స్థానంలో పనిచేసిన తన తండ్రి జైలు పాలైనప్పటికీ పార్టీపట్ల నిబద్ధత కొనసాగించారు. 2012లో చైనా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి.. శక్తిమంతమైన నేతగా ఎదిగారు.
బీజింగ్: చైనా (China) అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన షీ జిన్‌పింగ్ (Xi Jinping) సరికొత్త చరిత్ర సృష్టించారు. 2012లో చైనా పాలనా పగ్గాలు చేపట్టిన జిన్‌పింగ్.. మరో ఐదేళ్లు దేశాధ్యక్షుడి బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఓ ప్రముఖ గాయకురాలి భర్తగా బాహ్యప్రపంచానికి పరిచయమైన జిన్‌పింగ్.. శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఒకప్పుడు పార్టీ సభ్యత్వానికే చుక్కెదురైన పరిస్థితుల నుంచి.. చైనాను సుదీర్ఘ కాలం పాలించే స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆయనకు ఎదురైన సవాళ్లు.. సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో జిన్‌పింగ్ గడిపిన విషయాలను ఓసారి పరిశీలిస్తే..
జిన్‌పింగ్ 1953లో బీజింగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి షి ఝేంగ్‌షన్ చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక స్థానంలో పనిచేశారు. అయితే, పార్టీ ప్రక్షాళనలో భాగంగా అప్పటి అధ్యక్షుడు మావో తీసుకున్న నిర్ణయాలతో 1968లో ఝోంగ్‌షన్ పదవిని కోల్పోయారు. తిరుగుబాటుకు కారణమవుతారని ఊహించి అటువంటి నేతలందర్నీ మావో జెడాంగ్ జైల్లో పెట్టించారు. దీంతో పార్టీలో వైస్ ప్రీమియర్ స్థానంలో ఉన్న ఝెంగ్‌షన్ జైలుకు వెళ్లడంతో.. జిన్‌పింగ్ కుటుంబం కష్టాలపాలయ్యింది. ఆ సమయంలో వారు ఎన్నో అవమానాలు భరించారు. స్నేహితులు కూడా జిన్‌పింగ్‌ను దూరం పెట్టడంతో ఎంతో వేదనకు గురయ్యారు. అప్పటికి జిన్‌పింగ్ వయసు 15 ఏళ్లు.
గుహలో నివసించి..
1960ల్లో సాంస్కృతిక విప్లవం పేరుతో (రీ-ఎడ్యుకేషన్) ప్రముఖుల పిల్లల్ని నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. దీంతో వేల మంది చైనా నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే జిన్‌పింగ్ కూడా తన కుటుంబంతో కలిసి షాన్‌షీ ప్రావిన్సులోని కొండప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం లియాంగ్‌జియాహెకు వెళ్లారు. అక్కడున్న ఓ గుహలో ఇల్లు మాదిరిగా ఉన్న ప్రాంతంలోనే ఏడేళ్లు నివసించారు. గ్రామీణ ప్రజలు, పేదలతో కలిసి పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయం తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని జిన్‌పింగ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారింది.
ప్రముఖ సింగర్‌తో రెండో వివాహం..
1970ల్లో మావో మరణం తర్వాత జైలు నుంచి విడుదలైన ఝేంగ్‌షన్.. పార్టీలో జిన్‌పింగ్‌కు సముచిత స్థానం కల్పించేందుకు దోహదం చేశారని చెబుతుంటారు. జిన్‌పింగ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అనంతరం గాయనిగా పేరొందిన పెంగ్ లియువాన్‌ను 1987లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో జిన్‌పింగ్ కంటే ఆయన భార్యకే సెలెబ్రిటీగా ఎక్కువ పేరుంది.
అంచెలంచెలుగా ఎదిగి..
తన కుటుంబం సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. సీసీపీ(చైనా కమ్యూనిస్ట్ పార్టీ) పట్ల జిన్‌పింగ్ తన నిబద్ధతను కొనసాగించారు. పార్టీలో సభ్యత్వం కోసం ప్రయత్నించినప్పటికీ కుటుంబ నేపథ్యం (తండ్రి జైలుకు వెళ్లడం) కారణంగా పలుసార్లు తిరస్కరణకు గురయ్యింది. చివరకు 1974లో ఓ గ్రామానికి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై.. పార్టీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో ఫుజియన్ ప్రావిన్సు గవర్నర్‌గా, 2002లో జెజియాంగ్ ప్రావిన్సు చీఫ్‌గా, 2007లో షాంఘై బాధ్యతల్లో కొనసాగారు. చివరకు పార్టీ నిర్ణయాల్లో కీలకమైన పొలిట్‌బ్యూరోలో 2007లో నియమితులయ్యారు. ఐదేళ్ల తర్వాత (2012లో) హు జింటావో స్థానంలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెండు పర్యాయాల్లో ఎంతో శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్‌పింగ్.. జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ఫుడ్ పాయిజన్.. 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు అస్వస్థత
-
General News
Uppal Bhagayat plots: ‘ఉప్పల్ భగాయత్’లో ప్లాట్లకు మరోసారి ఈ-వేలం
-
Sports News
IPL 2023: వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్
-
Politics News
Rahul Gandhi: మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
-
General News
YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
-
India News
45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక