వైఫై స్పీడ్‌ను తెలుసుకుంటున్నారా?

నెట్‌ యూజర్లు ఇంట్లోనో, కార్యాలయాల్లోనో ఇంటర్నెట్‌ వాడేటప్పుడు ఎంత వేగంతో వస్తుందో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చెప్పే స్పీడ్‌కు.. వచ్చే స్పీడ్‌కు పొంతనే ఉండదు. ప్రకటనలో 100 ఎంబీపీఎస్‌ వేగంతో

Published : 16 Jan 2020 08:40 IST

అయితే ఈ అంశాలు సరిచూసుకోండి

నెట్‌ యూజర్లు ఇంట్లోనో, కార్యాలయాల్లోనో ఇంటర్నెట్‌ వాడేటప్పుడు ఎంత వేగంతో వస్తుందో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చెప్పే స్పీడ్‌కు.. వచ్చే స్పీడ్‌కు పొంతనే ఉండదు. ప్రకటనలో 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తామని ఉంటే వాస్తవానికి అది కాస్త ఏ 50 ఎంబీపీఎస్‌ వేగమో లేక 60 ఎంబీపీఎస్‌ వేగమో ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీకు అందుతున్న ఇంటర్‌నెట్ స్పీడ్‌ను కచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? వైఫై వేగాన్ని తెలుసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...

టూల్‌ సరిచూసుకోండి

• ఇంటర్నెట్‌ / వైఫై వేగాన్ని తెలుసుకోవటానికి ఏ స్పీడ్‌ టెస్ట్ సర్వీసును వాడాలన్న సందేహం మీకు అనిపించకమానదు. ‘కామ్‌కాస్ట్’ లాంటి ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లు వారు తమ సొంత టూల్‌తో వేగాన్నితెలుసుకోవచ్చని చెబుతున్నారు. టీవీ స్ట్రీమింగ్ వచ్చేటప్పుడు వైఫై వేగం తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌ వారి Fast.comను ఉపయోగించవచ్చు. 

ఒకే పరీక్షతో..

• వైఫై వేగాన్ని కేవలం ఒక్క పరీక్షతో నిర్ధారించకూడదు. సరైన వేగాన్నిఅంచనా వేయాలంటే వివిధ సమయాల్లో మూడు సార్లు వేగాన్ని పరీక్షించాలి. ఈ మూడు పరీక్షల్లో వచ్చిన ఫలితాల సరాసరి ఆధారంగా వేగాన్ని నిర్ధారించాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు వల్ల ఒక్క సమయంలో వచ్చే ఇంటర్నెట్‌ వేగం మరో సమయంలో రాకపోవచ్చు. వైఫై ద్వారా డేటా వేగాన్ని కనుక్కోవాలంటే సరైన ప్రదేశంలోనే వేగ నిర్ధారణ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదేశంలో వైఫై సిగ్నల్‌కు అవాంతరాలు కలిగించే ఉపకరణాలు ఉండకూడదు. రూటర్‌ నుంచి సిగ్నల్‌ పూర్తిస్థాయిలో వచ్చే ప్రదేశంలో పరీక్ష చేయాలి. 

సరైన సమయంలో..

• ఇంటర్నెట్ వేగం అనేది ఎంతమంది యూజర్లు ఉపయోగిస్తున్నారన్నదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒకేసారి ఎక్కువమంది యూజర్లు ఇంటర్నెట్‌ను వాడితే వేగం నెమ్మదించే అవకాశం లేకపోలేదు. మీరు వైఫై వేగాన్ని తెలుసుకోవటానికి ఇలాంటి సమయం సరైంది కాదు. ఉదాహరణకు ఇంట్లోని సభ్యులందరూ ఆ వైఫై పరిధిలో కనెక్ట్‌ అయి ఉంటే ఆ సమయంలో సాధారణంగా వచ్చే డేటా వేగం కంటే తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 

డౌన్‌లోడ్ చేసేటప్పుడు...

• వైఫై స్పీడ్ టెస్ట్ చేసేటప్పుడు ఆ కనెక్షన్‌ నుంచి వీడియోలు, ఇతర ఫైల్స్‌ లాంటివాటని డౌన్‌లోడ్‌లో ఉంచకూడదు. రూటర్‌కు ఎక్కువ కనెక్షన్‌లు ఉంటే డేటా వేగానికి సంబంధించిన బ్యాండ్‌ విడ్త్‌పై ప్రభావం పడుతుంది. దీంతో వైఫై వేగం తగ్గే అవకాశముంది.

కాబట్టి వైఫై టెస్ట్ చేసే ముందు రూటర్‌కు కనెక్ట్ అయిన డివైసెస్‌ నుంచి ఎటువంటి డౌన్‌లోడ్‌లు ఉండకుండా జాగ్రత్త వహించాలి. వైఫై వేగాన్ని తెలుసుకునే ముందు తప్పనిసరిగా మీ కంప్యూటర్‌ను రీబూట్ చేయలి. పరీక్ష చేసే సమయంలో మరే ఇతర అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు మీ కంప్యూటర్‌లో రన్‌ కాకుండా చూసుకోవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు