రాష్ట్రాలకు ఆ అధికారముందా?

పౌరసత్వ చట్ట సవరణ చట్టంపై కేరళ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131 ప్రకారం రాష్ట్రాల మధ్య లేదా కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏదేనీ అంశంపై ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఈ ఆర్టికల్‌ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయవచ్చు

Published : 20 Jan 2020 11:59 IST

పౌరసత్వ చట్ట సవరణ చట్టం వెనక్కు తీసుకోవాలని కోరుతూ కేరళ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131 ప్రకారం రాష్ట్రాల మధ్య లేదా కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏదేనీ అంశంపై ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఈ ఆర్టికల్‌ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయవచ్చు.

రెండు తీర్పులు..
రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య వివాదం ఏర్పడిన సమయంలో  రాష్ట్రాలు కేంద్ర చట్టాలను సవాల్‌ చేయకూడదని 2012లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్‌ vs కేంద్రం కేసులో ఈ తీర్పు వెలువడింది. 2015లో ఝార్ఖండ్‌  vs  బిహార్‌ల మధ్య వివాదం నెలకొన్న అంశంపై విసృతస్థాయి ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీచేసింది. 

ఆర్టికల్‌ 256
పార్లమెంటు చేసిన చట్టాలను ప్రతి రాష్ట్రం అమలు చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 256 వివరిస్తోంది. ఒక వేళ చట్టాలను అమలు చేయకుంటే రాష్ట్రాలను కేంద్రం అమలు చేయమని ఆదేశించవచ్చు. 

అమలుచేయాల్సిందే.. సిబల్‌
 పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు.  కేంద్రచట్టాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేసే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. అయితే చట్టాన్ని అమలు చేయబోమని చెప్పే హక్కు రాష్ట్రాలకు లేదన్నారు.  కేంద్రం చట్టాలను ప్రతి రాష్ట్రం అమలు చేసి తీరాలని స్పష్టం చేశారు.  ఒక వేళ రాష్ట్రాలు వ్యతిరేకిస్తే మరింతగా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. సిబల్‌ విశ్లేషణ వాస్తవమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌  అన్నారు. రాజ్యంగం ప్రకారం పార్లమెంటు చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనన్నారు.  సీఏఏ అంశంపై  సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు