ఒక దీవి..ఓ మహిళ.. 31 మంది సైనికులు
అనతహన్.. పసిఫిక్ సముద్రంలోని చిన్నదీవి.. కేవలం 13 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన దీవిలో 31 మంది జపాన్ సైనికుల మధ్య ఒక మహిళ ఐదేళ్ల పాటు జీవించింది... 1950లో ఆమెను తీరంలో గుర్తించిన అమెరికా నౌకాదళం రక్షించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
అనతహన్.. పసిఫిక్ సముద్రంలోని చిన్నదీవి.. కేవలం 13 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన దీవిలో 31 మంది జపాన్ సైనికుల మధ్య ఒక మహిళ ఐదేళ్ల పాటు జీవించింది... 1950లో ఆమెను తీరంలో గుర్తించిన అమెరికా నౌకాదళం రక్షించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అయితే 1945లోనే రెండో ప్రపంచయుద్దం ముగిసినా అక్కడి జపాన్ సైనికులు నమ్మలేదు.అమెరికాతో తమ పోరాటం కొనసాగుతోందని భావించారు. చివరకు 1951లో వారు లొంగిపోయారు.
నౌకలు మునిగిపోవడంతో..
1944లో అనతహన్ దీవి సమీపంలో మూడు జపాన్ నౌకలపై అమెరికా వాయసేన బాంబుల వర్షం కురిపించడంతో జపాన్ నౌకలు మునిగిపోయాయి. 31 మంది జపాన్ సైనికులు మాత్రం ప్రాణాలతో బతికి సమీపంలోని అనతహన్ దీవికి చేరుకున్నారు. అప్పటికే ఆ దీవిలో షోయిచి హిగ ఆయన భార్య కజుకొతో కలిసి అక్కడ వ్యవసాయం చేసేవారు. తన సోదరిని చూడాలని షోయిచి హిగ అక్కడ నుంచి వెళ్లాడు. అతను ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో యజమాని కికైచిరో కజుకొను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో 31 మంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారికి ఆ దంపతులు ఆశ్రయమిచ్చారు. 1946లో కికైచిరో కన్నుమూశాడు. దీంతో ఆ దీవి మొత్తానికి కజుకో యజమానిగా మారింది.
వరుసగా 11 మంది మరణం..
దీంతో 31 మందిలో కొందరు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు. ఆమె కోసం వారిలో వారే ఘర్షణలకు దిగారు. వారికి నేతృత్వం వహిస్తున్న కెప్టెన్ ఇసిద ఆమెను ఒకరికి ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నిరోజులకే అతను దారుణహత్యకు గురయ్యాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్న ఒకరి తరువాత ఒకరుగా నలుగురు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఐదేళ్లలో 11మంది అనూహ్యంగా మరణించారు. దీంతో మిగిలిన 20 మంది కజుకొను హతమార్చాలని పథకం వేశారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె తీరం చేరుకోవడంతో అక్కడ గస్తీలో ఉన్న అమెరికా నౌకాదళ సిబ్బంది రక్షించారు. తన సొంత పట్టణమైన ఒకినావాకు చేరుకుంది. అప్పటికే ఆమె మొదటి భర్త షోయిచి మరొక మహిళను వివాహం చేసుకొని వుండటంతో నిర్ఘాంత పోయింది. తరువాత ఒంటరిగా జీవనం సాగించి 1970లో కన్నుమూసింది.
20 మంది లొంగిపోయారు..
దీవిలో ఉన్న 20 మంది జపాన్ సైనికులు లొంగిపోవాలని అమెరికా జపాన్ భాషలో కరపత్రాలను దీవిలో వెదజల్లింది. అయితే యుద్ధం ముగియలేదని భావించిన జపాన్సైనికులు లొంగిపోలేదు. చివరకు వారి కుటుంబసభ్యులతో రాసిన లేఖలను దీవికి పంపగా నిజాన్ని గ్రహించిన వారు లొంగిపోయారు.
సినిమాలు , గ్రంథాలు..
అనతహన్ ఉదంతంపై పలు గ్రంథాలు వెలువడ్డాయి. 1953లో ఈ ఘటనపై ఒక సినిమాను నిర్మించారు. దీవిలో భూప్రకంపనలు రావడంతో అక్కడున్న కొద్దిమందిని సమీపంలోని సైపాన్ దీవికి తరలించారు. ప్రస్తుతం ఆ దీవిలో ఎవరూ లేరు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్‌లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్‌కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
-
పార్ట్‌టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు