భగ్నప్రేమికులకు ఇది ప్రత్యేకం..!

వాలంటైన్స్‌ డే దగ్గర పడుతోంది.. సింగిల్‌గా ఉన్నవాళ్లకి ప్రేమించిన వ్యక్తికి ప్రేమ విషయం చెప్పడానికి ఇదే మంచి రోజు. ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటకు ఇదో పండగ రోజు. కానీ.. ప్రేమలో విఫలమైన వారికి..? సాధారణ రోజుల కంటే.. ఈ వాలంటైన్‌ రోజున

Updated : 13 Feb 2020 14:52 IST

బొద్దింకలు, ఎలుకలను సిద్ధం చేసిన జూ..

రేపే వాలంటైన్స్‌ డే.. సింగిల్‌గా ఉన్నవాళ్లు తమ ప్రేమను తెలియజెప్పడానికి ఇదే మంచి రోజు. ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటకు ఇదో పండుగ రోజు. కానీ, ప్రేమలో విఫలమైన వారికి..? ఒంటరిగా మది రగిలే రోజు. ప్రేమ లోకంలో విహరించి.. ఒక్కసారిగా పాతాళంలో పడ్డట్టుగా ఉంటుంది. తన ప్రేమకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిన లవర్‌ను కసితీరా తిట్టుకోవాలని ఉంటుంది. అలాంటి వారు మాజీ లవర్‌పై కోపం పోగొట్టుకోవడానికి టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియో జూ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోంది. 

వాలంటైన్స్‌ డే రోజున భగ్న ప్రేమికులు ఎవరైనా ఇక్కడకు వచ్చి బొద్దింకలకు, ఎలుకలకు తమ మాజీ ప్రియుడు\ప్రేయసి పేరును పెట్టుకోవచ్చు. అలా పేరు పెట్టిన వాటిని స్వయంగా తీసుకెళ్లి జంతువులకు తినిపించొచ్చు. అలా బతికున్న బొద్దింకను జంతువులకు, ఎలుకను పాములకు ఆహారంగా పెట్టొచ్చు. సజీవంగా, దారుణంగా అవి వాటికి ఆహారంగా మారుతుంటే.. భగ్నప్రేమికులు తమ కోపాన్ని తీర్చుకోవచ్చన్నమాట. అయితే బొద్దింకకు ఐదు డాలర్లు, ఎలుకకు 25 డాలర్లు చొప్పున జూ యాజమాన్యానికి రుసుము చెల్లించాల్సి ఉంటుందట. ఇదంతా కేవలం భగ్నప్రేమికుల కోపాన్ని పోగొట్టి.. వారిలో సానుకూల ఆలోచనలు తీసుకురావడానికే అని జూ యాజమాన్యం చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని