ఇది గ్రామం కాదు.. మ్యూజియం

చారిత్రక విషయాలు, ప్రాచీన కాలంలో ఉపయోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచే మ్యూజియాల గురించి మనకు తెలుసు. కానీ, పురాతన ఇళ్లను ప్రదర్శనకు పెట్టిన మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా? దక్షిణ ఇంగ్లాండ్‌లో ఉందీ మ్యూజియం. ఇందులో ప్రాచీనం కాలంలో నిర్మించిన ఇళ్లను అమాంతం తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతున్నారు.

Updated : 22 Mar 2020 17:49 IST

చారిత్రక విషయాలు, ప్రాచీన కాలంలో ఉపయోగించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచే మ్యూజియాల గురించి మనకు తెలుసు. కానీ, పురాతన ఇళ్లను ప్రదర్శనకు పెట్టిన మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా? దక్షిణ ఇంగ్లాండ్‌లో ఉందీ మ్యూజియం. ఇందులో ప్రాచీనం కాలంలో నిర్మించిన ఇళ్లను అమాంతం తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతున్నారు. అలా సేకరించి పెట్టిన ఇళ్లతో ఆ ప్రాంతం ఓ గ్రామంలా కనిపిస్తుంటుంది.

వెస్ట్‌ సస్సెక్స్‌లో సింగల్టన్‌ అనే గ్రామంలో వీల్డ్‌ అండ్‌ డౌన్‌లోడ్‌ లివింగ్‌ మ్యూజియను 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ తొమ్మిదో శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య నిర్మించిన ఇళ్లను ప్రదర్శనకు పెట్టారు. పూర్వం ప్రజలు ఇళ్లను ఎలా కట్టుకున్నారు.. వాటి నామూనా, నిర్మించిన విధానం ఈ కాలం నాటి వారికి తెలియజెప్పాలని ఆనాటి ఇళ్లను మ్యూజియం నిర్వాహకులు సేకరించి పెడుతున్నారు. పురాతన భవనాలు, ఇళ్లు, పాకలు, చర్చి, పాఠశాలలు ఇలా పురాతన నిర్మాణాలు ఎక్కడ కనిపించినా వాటిని జాగ్రత్తగా పునాదులతో సహా తవ్వి మ్యూజియంకు తరలిస్తున్నారు.

1967లో ఈ మ్యూజియం ప్రారంభమైంది. రాయ్‌ ఆర్మ్‌స్ట్రంగ్‌ అనే వ్యక్తి మరికొందరు కలిసి ఈ పురాతన ఇళ్ల సేకరణను ప్రారంభించారు. ఇళ్లు ఏర్పాటు చేయడానికి బ్రిటన్‌కు చెందిన రచయిత ఎడ్వర్డ్‌ జేమ్స్‌ కొంత భూమిని విరాళంగా ఇచ్చాడు. దీంతో ఈ గ్రామంలో తొలిసారిగా ఏడు ఇళ్లతో 1970లో మ్యూజియం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇళ్ల సంఖ్య పెరుగడంతో సందర్శకులను తాకిడి పెరిగింది. ఈ మ్యూజియంకు వస్తే.. పల్లెటూరికి వచ్చినట్లుగా ఉంటుంది. పచ్చని పైరు.. అక్కడక్కడ వైవిధ్యమైన ఇళ్లు.. వాటి ఆకృతులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. చాలా మంది ఈ గ్రామంలో పుట్టిన రోజు, క్రిస్మస్‌ తదితర వేడుకలను జరుపుకోవడం విశేషం.

''


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని