Updated : 10/06/2020 13:45 IST

వీటిని ‘గూగుల్’ చేస్తే .. మీకు ట్రబుల్!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ మనకు అందుబాటులోకి రాకముందు బామ్మలు చెప్పే కథలు, గురువులు చెప్పే పాఠాలు వింటూ జ్ఞానాన్ని సంపాదించేవాళ్లం. ఏ మాత్రం సందేహమొచ్చిన ఒకటికి పదిసార్లు అడిగి తెలుసుకోవటం అప్పటి అలవాటు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. మనకు కావాల్సిన అన్ని విషయలూ అరచేతిలోని స్మార్ట్‌ఫోన్లోనే సాక్షాత్కారిస్తున్నాయి. ఏదైనా కొత్త విషయం తెలియకపోయినా, సందేహం కలిగిన వెంటనే సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌లో వెతకాల్సిందే. కానీ కొన్ని విషయాలను తెలుసుకోవాలనే మీ జిజ్ఞాస మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి..

బాంబ్‌ తయారీ.. మీపై గురి
బాణసంచా, పేలుడు పదార్థాల తయారీ గురించి కొందరికి అమితాసక్తి ఉంటుంది. అవి ఎలా పనిచేస్తాయి? వాటిలో వాడే పదార్థాలేంటి.. ఇలా ఇతరత్ర విషయాలను తెలుసుకునేందుకు గూగుల్ చేస్తుంటారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. సెర్చ్ ఇంజన్‌ గూగుల్‌లో కొన్ని పదాలను సెర్చ్‌ చేస్తే వారిపై సైబర్ డిపార్ట్‌మెంట్‌ ఓ కన్ను వేసి ఉంచుతుంది. ఎందుకంటే బాంబులు, పేలుడు పదార్థాలను ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతుంటారు. కొందరు తెలివిగా సైబర్ పోలీసులకు చిక్కకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని గూగుల్ నుంచి తస్కరిస్తుంటారు. ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలానే బాంబుల తయారీ గురించే తెగ వెతికాడు. చివరికి పోలీసుల వలలో పడ్డాడు. ఇలాంటి ప్రమాదంలో మీరూ పడకండి.

మహిళల ప్రసవం..
ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా మహిళల ప్రసవానికి సంబంధించిన సన్నివేశాలు కనపడుతున్నాయి. కథా పరంగా ఆ సన్నివేశం అనివార్యం కావచ్చు. అయితే అదే సందర్భంలో కొందరు మహిళల ప్రసవానికి సంబంధించిన విషయాలను తెగ గూగుల్ చేస్తున్నారట. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదే. కానీ కొన్ని విషయాలను అతిగా పట్టించుకోకూడదు. అది మీకు మానసికంగా ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ప్రసవ సమయంలో మహిళ పడే వేదన మాటల్లో వర్ణించలేం. అంతటి ఇబ్బందికరమైన విషయాన్ని గూగుల్ చేసి మీ మానసిక స్థితిపై ఒత్తిడి పెంచుకోకండి.

మాదక ద్రవ్యాలు.. మారేను మీ గమ్యాలు
పెద్దలు హంసలాంటి గుణాన్ని పెంపొందించుకోవాలని పిల్లలకు చెబుతుంటారు. హంస పాలను నీళ్లను వేరు చేస్తుందంటారు. అలానే హంసలాగా చెడును వదిలి మంచిని అలవరుచుకుంటేనే సంఘంలో గౌరవంతోపాటు ఇబ్బందులు లేని జీవితం సొంతమవుతుంది. ప్రస్తుతం యువత పెడదోవ పట్టడానికి ఒక కారణం మాదక ద్రవ్యాలు (డ్రగ్స్‌) వాడకం. డ్రగ్స్‌ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే కొందరు డ్రగ్స్‌ తయారీ విషయాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించి చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి డ్రగ్స్‌ తయారీ గురించి గూగుల్‌లో తెలుసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే అనవసర విషయాలపై సెర్చింగ్ ఒక్కోసారి మీ జీవిత గమ్యాలను కూడా తారుమారు చేస్తుంది.

మరికొన్ని..
పై విషయాలతోపాటు మరికొన్ని పదాలను గూగుల్‌లో సెర్చ్‌ చేయకపోవడమే మంచిది. అవేంటంటే బెడ్ బగ్స్‌, బెల్లీ బటన్ బగ్స్, హంట్స్‌మ్యాన్ స్పైడర్‌, బ్లూ వాఫెల్, క్రొకొడిల్, జిగ్గర్స్‌, మౌత్ లార్వా, బాట్‌ప్లై రిమూవల్ వంటి వాటిని గూగుల్‌లో వెతకకండి. ఎందుకంటే ఇవి చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాయి. ఆసక్తి మంచిదే కానీ కొన్నిసార్లు అమితాసక్తి మంచిదికాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ సందేహమొచ్చిన గూగుల్ చేసే ఈ రోజుల్లో కొన్ని విషయాల సెర్చింగ్‌ చేయాలంటే మాత్రం కాస్త ఆలోచించండి.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్