Updated : 27 Jun 2020 19:14 IST

రోబో: రజనీలాగే.. కానీ నిజంగానే

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోబో సినిమా గుర్తుందా! అందులో రజనీకాంత్‌.. కృత్రిమ మేథస్సు(ఏఐ)తో ఓ హ్యూమనాయిడ్‌ రోబోను రూపొందిస్తారు. చిట్టి ది రోబో అంటూ ఆ రోబో చేసే విన్యాసాలను పార్ట్‌ 1, పార్ట్‌2 సినిమాల్లో చూసి ఔరా అనుకున్నాం. ప్రధాన పాత్ర రోబోగా రజనీకాంత్‌ బాగా నటించారు. కానీ ఇప్పుడు నిజమైన ఏఐ రోబోనే ఓ జపాన్‌ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనుంది. కృత్రిమ మధస్సుతో రూపొందించిన రోబో నటించబోతున్న తొలి చిత్రం ఇదేనట.

‘‘ఓ శాస్త్రవేత్త.. మనిషి డీఎన్‌ఏకి సంబంధించి చేసిన ప్రయోగంలో ప్రమాదాలు ఏర్పడతాయి. వాటి నుంచి ఆ శాస్త్రవేత్త రూపొందించిన ఎరికా అనే ఏఐ రోబో ఎలా కాపాడింది’’అనేది ఈ సినిమా కథ. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ‘బీ’ అనే పేరు పెట్టారు. 70 మిలియన్‌ డాలర్లు(సుమారు. రూ. 530 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కనుంది. 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో నటించే రోబోను జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు హిరోషి ఇషిగురొ, కొహి ఒగవా రూపొందించారు. సినిమా కోసం రోబోకు నటనకు సంబంధించిన ప్రోగ్రాం అప్‌లోడ్‌ చేసి శిక్షణ ఇచ్చారు. 

చిత్ర దర్శకుడు సామ్‌ కొజ్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘సాధారణంగా నటులు వారి నిజ జీవితంలో అనుభవాలతో సినిమాల్లో నటిస్తుంటారు. కానీ ఎరికాకు అలాంటి అనుభవం లేదు. అందుకే కొంత శిక్షణ ఇచ్చి.. రోబో కదలికలు, హావభావాలు, వేగాన్ని మేం నియంత్రిస్తాం’’అని చెప్పుకొచ్చారు. మరి అసలు రోబో నటించే ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే. 

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని