
Crime: డిజిటల్ వేధింపులు.. ముందే జాగ్రత్త పడండి
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న కాలంతోపాటు ప్రేమించుకునే తీరు మారుతోంది. ప్రేమికులు, డేటింగ్ చేసేవాళ్లు.. డిజిటల్ టెక్నాలజీ వేదికగా తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నారు. వారి వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఈ డిజిటల్ ప్రేమ.. హద్దులు దాటి వేధింపుల వరకూ వెళ్తోంది. సరిగా మాట్లాడట్లేరని, కావాల్సింది ఇవ్వట్లేరని ఇరువురి మధ్యన మనస్పర్థలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తోంది. ఈ సమయంలోనే వేధింపులకు డిజిటల్ టెక్నాలజీ అడ్డాగా మారుతోంది. ప్రతికారేచ్ఛతో ప్రేమించినవారి ఫొటోలను అసభ్యంగా మార్చి, సోషల్‌మీడియాలో పోస్టు చేయడం, అసభ్య కామెంట్లు పెట్టడం వంటివి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి డిజిటిల్ వేధింపుల్లో ఎక్కువగా అమ్మాయిలే బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ వేధింపులకు పాల్పడే అవకాశం ఉన్న వారిని ఎలా కనిపెట్టాలి? ఈ- వేధింపులకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూద్దాం..
ఇలాంటి వారిని దూరం పెట్టడమే ఉత్తమం
ప్రేమించుకునే సమయంలో అంతా బాగానే ఉంటుంది. అదే సమయంలో భాగస్వామిలో ఈర్ష్య సహజంగానే పెరుగుతుంటోంది. అయితే అది పరిధి దాటినప్పుడు ప్రేమ స్థానంలో డిమాండ్లు, బెదిరింపులు, ఆగ్రహావేశాలు వచ్చి చేరుతాయి. ఎలాంటి వారిలో ఇవి ఎక్కువ ఉండే అవకాశాలున్నాయంటే..
* మీరు పనిలో ఉన్నారని చెప్పినా పదే పదే సంక్షిప్త సందేశాలు పంపుతూ సమాధానం ఇవ్వాలని అడుగుతుంటారు. అలా చేయని పక్షంలో కోపం ప్రదర్శిస్తారు.
* ఏ సమయంలో కాల్ చేసినా, సంక్షిప్త సందేశం పంపినా మాట్లాడాలని డిమాండ్ చేస్తుంటారు.
* అప్పుడప్పుడు అసభ్య సందేశాలు, ఫొటోలు, వాయిస్ కాల్స్ పంపుతూ వేధిస్తుంటారు.
* మీరు ఏం చేస్తున్నారనే విషయాలను తెలుసుకోవడం కోసం మీ సోషల్‌మీడియా ఖాతాలను నిరంతరం పరిశీలిస్తుంటారు.
* మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడం కోసం మీ ఫోన్‌లో జీపీఎస్ ట్రాకర్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని బలవంతం చేయొచ్చు.
* సోషల్‌మీడియాలో మీరు ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో మాట్లాడాలనే విషయాలను సైతం మీ భాగస్వామే నిర్ణయిస్తుంటారు.
* సోషల్‌మీడియాలో నకిలీ ఖాతా తెరిచి లేదా మీ ఖాతాను హ్యాక్ చేసి మీపై నిఘా పెడుతుంటారు. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు.
* సోషల్‌మీడియా ఖాతాలు, ఫోన్ పాస్‌వర్డ్ చెప్పమని అడుగుతుంటారు. మీరు చేసిన సంక్షిప్త సందేశాలు, మెయిల్స్, కాల్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు.
ఇలాంటి వారిలో భాగస్వామిపై ప్రేమ కన్నా.. ఈర్ష్య, అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. తమకు ఎక్కడ దూరం అవుతారో అని.. ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. పై వాటిలో ఏది జరగకపోయినా ఇక వేధింపులకు పాల్పడటం ప్రారంభిస్తారు. అందుకే ఇలా ప్రవర్తించేవారికి వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
వేధింపులకు గురికావొద్దంటే..
ప్రతి బంధంలో కొన్ని పరిధులుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పరిధులు దాటకుండా ఉండగలగాలి. భాగస్వామి కూడా పరిధి దాటకుండా చూసుకోవాలి. లేకపోతే డిజిటల్ వేధింపులు తప్పవు. వీటి నుంచి తప్పించుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే..
* మీ ఫోన్ పాస్‌వర్డ్, సోషల్‌మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోకండి.
* మీరు ఎక్కడికైన వెళ్తే సోషల్‌మీడియాలో చెక్-ఇన్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇబ్బందులు కలగవని భావిస్తేనే పెట్టండి.
* మీ స్నేహితులు సోష్‌మీడియాలో పోస్టు చేసే ఫొటోల్లో మిమ్మల్ని ట్యాగ్ చేసే ముందు మీ అనుమతి తీసుకోమని చెప్పండి.
* సోషల్‌మీడియాలో, ఫోన్‌లో పంపించే ఫొటోలు.. వీడియోల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యక్తిగత విషయాలను అసలు పంచుకోకండి.
* మీ పాస్‌వర్డ్‌లను తరచూ మారుస్తూ ఉండండి. సోషల్‌మీడియా ఫ్రొఫైల్స్‌ను సేఫ్ మోడ్‌లో పెట్టుకోండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
-
General News
Telangana News: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..