Kalahandi: అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!

పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది.

Published : 13 Jun 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: కలహండి (Kalahandi).. గుర్తుందా. ఒడిశా పశ్చిమ ప్రాంతంలోని ఒక జిల్లా. 1985లో ఇక్కడ పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకోవడం వెలుగులోకి రావడంతో దేశం నిర్ఘాంతపోయింది. స్థానికంగా నెలకొన్న కటిక పేదరికంపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం కేబీకే (కలహండి-బొలంగిర్‌- కొరాపుట్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది అన్ని పథకాల తరహాలోనే మందకొడిగా కొనసాగింది. 2000వ సంవత్సరం వరకు ఇక్కడి నుంచి వలసలు కొనసాగేవి. దేశంలో ఎక్కడ చూసినా ఈ జిల్లాలకు చెందిన శ్రామికులే కనిపించేవారు.

సీన్‌ మారింది..

అయితే అదంతా గతం. ఇంద్రావతి నదిపై ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయింది. లక్షల ఎకరాల  మెట్ట భూములు సాగులోకి వచ్చాయి. 2001లో ఇంద్రావతి నదిపై నిర్మించిన ప్రాజెక్టుతో జిల్లాలోని సాగుభూములకు నీరు అందింది. రెండు, మూడు పంటలకు నీళ్లు రావడంతో వరిసాగు చేశారు. క్రమంగా వ్యవసాయం పుంజుకోవడంతో జిల్లా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. దేశం నలుమూలలకు వలసవెళ్లిన కలహండి రైతులు తిరిగి తమ జన్మభూమికి చేరుకున్నారు. పంటల సాగుతో దేశంలో వరిసాగును పండించే ప్రధాన ప్రాంతాల్లో ఒకటిగా మారింది.

మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!

కలహండి వ్యవసాయ పురోభివృద్ధితో జిల్లాలోకి పలు వ్యవసాయ యంత్ర పనిముట్ల కంపెనీలు తమ బ్రాంచీలను ప్రారంభించాయి. జిల్లాలో రోడ్ల నిర్మాణంతో ట్రాక్టర్లు వచ్చాయి. అనేక బ్యాంకులు తమ శాఖలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రజల జీవనవిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

భూసేకరణ లేకుండా..

ప్రాజెక్టు నుంచి నీటిని పొలాలకు మళ్లించేందుకు కాలువలను విభిన్నంగా నిర్మించడం విశేషం. అప్పటి సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆలోచనలకు అనుగుణంగా దాదాపు 1200 కి.మీ. మేర కాలువలను అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ల ద్వారా నిర్మించారు. దీంతో రైతులు యథావిధిగా తమ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఎక్కడా భూయజమానుల నుంచి ఆందోళనలు వ్యక్తం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని