Kacha badam: ‘కచ్చా బాదం..’ ట్రెండ్ అవుతోన్న వీధి వ్యాపారి పాట!
సోషల్‌మీడియాలో ఈ మధ్య ఒకటి గమనించారా? ‘కచ్చా బాదం.. ’ అంటూ ఓ పాట తెగ వైరలైంది. ఎక్కడా చూసినా ఆ పాటే మార్మోగిపోతుంది. దీనికి సాధారణ నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు కూడా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా
ఇంటర్నెట్ డెస్క్: సోషల్‌మీడియాలో ఈ మధ్య ఒకటి గమనించారా? ‘కచ్చా బాదం.. ’ అంటూ ఓ పాట తెగ వైరలైంది. ఎక్కడా చూసినా ఆ పాటే మార్మోగిపోతుంది. దీనికి సాధారణ నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు కూడా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేస్తే.. ఆ వీడియోని బన్నీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. విదేశాలకు చెందిన నెటిజన్లు కూడా ఆ ట్యూన్‌కి ఫిదా అయ్యారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ పాట ఏ పాపులర్ సింగరో పాడింది కాదండోయ్.. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారిది. కడుపుకూటి కోసం అతడు కట్టిన ఆ బాణి నెట్టింట్లో వైరల్ అవడమే కాదు.. అతడి జీవితాన్నీ మార్చేసింది.
పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ ఒక వీధి వ్యాపారి. ద్విచక్రవాహనంపై వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు అమ్ముతుంటాడు. పచ్చి పల్లీలను.. కచ్చా బాదం అని కూడా పిలుస్తారు. పాతవి, పాడైన వస్తువుల్ని తీసుకొని పచ్చిపల్లీలు ఇస్తుంటాడు. అయితే, వీధుల్లోకి వెళితే ఇంట్లో ఉండే ప్రజలకు తను వచ్చినట్లు తెలియాలి కదా..! కచ్చా బాదం అని అరిచే బదులు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నాడు. అలా పాత సామాన్లు, పాడైన మొబైల్‌ఫోన్లను తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తాననే అర్థం వచ్చేలా లిరిక్స్ రాసుకొని ‘కచ్చా బాదం..’ ట్యూన్ కట్టాడు.
వీధుల్లో తిరుగుతూ భువన్ పాడే ఆ పాట విని జనాలు ఫిదా అయ్యారు. భువన్ ఎక్కడికి వెళ్లినా అతడి చుట్టూ జనం చేరి పాటను వింటూ ఎంజాయ్ చేసేవారు. కొన్ని నెలల కిందట భువన్ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరలయింది. ఎప్పుడైతే మోడల్ అంజలి అరోరా ఆ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు సృష్టించి వీడియో చేసిందో.. అప్పటి నుంచి ఆ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. నెటిజన్లు ఆ పాటకు అంజలి అరోరా స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆ క్రేజ్ దేశంతోపాటు విదేశాలకు పాకింది. సింగపూర్, పోర్చుగీస్ దేశస్థులు సైతం ఈ ‘కచ్చా బాదం’ పాటకు స్టెప్పులేశారు. దీంతో భువన్ బాగా పాపులరైపోయాడు. చాలా మంది అతడి గురించి ఆరా తీశారు.. ఇంటర్వ్యూలు చేశారు.
భువన్ పాడిన పాట సినిమా ఇండస్ట్రీకి వరకు చేరడంతో ఇటీవల ఓ మ్యూజిక్ సంస్థ అతడితో ఓ ర్యాప్ సాంగ్ రూపొందించింది. అవే లిరిక్స్‌కు ర్యాప్‌ను జోడించి.. భువన్ వస్త్రధారణను మార్చేసి.. అతడి పక్కన ఓ మోడ్రన్ అమ్మాయితో డాన్స్ చేయించారు. యూట్యూబ్‌లో ఈ పాటను విడుదల చేయగా.. ఇప్పటి వరకు 5.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. మరోవైపు భువన్‌కు కొంత ఆర్థిక సాయం అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే, గుడిసెలాంటి ఇంట్లో బతుకు వెళ్లదీస్తున్న తనకి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. భువన్‌కు ఒక భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
ఏ చిన్న విషయం ఆసక్తికరంగా అనిపించినా దాన్ని నెటిజన్లు సోషల్‌మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. అలా ఓవర్‌నైట్‌లో పాపులారిటీ తెచ్చుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. గాయనిలు బేబి, రేణూ మండల్, ‘బచ్‌పన్ కా ప్యార్’ పాట పాడిన బాలుడు సహదేవ్ అలా వచ్చిన వారే. వారంతా అద్భుతంగా పాడుతుండటంతో సంగీత దర్శకులు సైతం పిలిచి మరీ అవకాశాలిచ్చారు. ఇప్పుడు భువన్ కూడా తన సొంత పాటతో అందరినీ ఆకట్టుకొని పాపులరయ్యాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: అబిడ్స్ ట్రూప్ బజార్లో అగ్నిప్రమాదం.. 3 ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
-
Crime News
Cyber Fraud: ఫ్రీ థాలీ కోసం ఆశపడితే.. రూ.90వేలు పోయే..!
-
Movies News
Salman Khan: నాకు పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్‌ఖాన్
-
World News
North Korea: కిమ్ రాజ్యంలో మరో దారుణం.. 2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు
-
Sports News
IPL 2023: సెహ్వాగ్ టాప్-5 బ్యాటర్లు వీరే.. లిస్ట్‌లో లేని విరాట్, గిల్!
-
World News
Asiana Airlines: త్వరగా విమానం దిగాలని.. గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరిచాడట..!