వెబ్‌సైట్@విజ్ఞానం..!!
ఇంటర్నెట్ డెస్క్: వెబ్‌విహారంలో పడి సమయాన్నే మర్చిపోతుంటారు కుర్రకారు. ఖాళీ దొరికితే చాలు సోషల్ వేదికల్లో సందడి చేస్తుంటారు. కళాశాలలూ తెరుచుకోకపోవడంతో రోజంతా ఇంటర్నెట్‌నే ఇళ్లుగా మార్చేసుకుంటున్నారు. అందులోనే తిరిగేస్తున్నారు. మరి ఆ విహారాన్ని కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విజ్ఞానం కోసమూ ఉపయోగించుకుంటే.. సమయాన్ని గడిపేయడంతో పాటు సమాచారాన్నీ తెలుసుకుంటే..! అందుకే ఈ వెబ్‌సైట్‌లపై ఓ లుక్కేయండి.
ఏదైనా చేసేద్దామంటే..
ఈ గ్యాడ్జెట్‌ని ఎలా తయారు చేసుంటారు అనే సందేహం మీకు కలిగిందా? ఈ చిన్ని రోబోను సృష్టించేందుకు ఎలాంటి పరికరాలు వాడుంటారో తెలుసుకోవాలనుందా? ఈ క్రాఫ్ట్ భలే బాగుంది దాన్ని ఎలా చేసుంటారు? ఇంట్లోనే మనమూ ఇలాంటివి చేయాలంటే ఎలా అనిపించిందా? అయితే ఈ వెబ్‌సైట్‌పై ఓ లుక్కేయాల్సిందే. పేరు www.instructables.com సర్క్యూట్‌లు, క్రాఫ్ట్, వంట తదితర వాటిని ఎలా తయారు చేశారు. అందుకేమేం పరికరాలు వాడారో అంచెలవారీగా స్టెప్ బై స్టెప్ వివరణ ఇస్తుంది. వీడియోలు చూస్తూ ఇంట్లో మీరే తయారు చేయొచ్చు.
చరిత్ర చదివేద్దాం..
మీకు చరిత్ర అంటే ఇష్టమా? చరిత్రకి సంబంధించిన విషయాలంటే ఆసక్తా? అయితే ఈ వెబ్‌సైట్ మీ కోసమే. పేరు Ancient History Encyclopedia. ప్రపంచ చరిత్రలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని దీనిలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మానవుని పుట్టుక నుంచి తదితర పరిణామక్రమాలను చదివేయొచ్చు. మీకు కావాల్సిన చరిత్ర కాలాన్ని వెతికీ చదవొచ్చు. అంతేకాదు ఆ కాలం నాటి వస్తువులు చూడొచ్చు. చారిత్రక స్థలాల విశేషాలనూ తెలుసుకోవచ్చు. ఆడియో రూపంలోనూ వినేయొచ్చు. వీడియోల రూపంలో చూసేయొచ్చు.
కోర్సులతో కుస్తీకి..
ఇంట్లో ఖాళీగా ఉన్నాం. ఏదైనా కోర్సు నేర్చుకుందామంటే శిక్షణ శిబిరాలు తెరుచుకోలేదు. పోనీ ఆన్‌లైన్‌లో ప్రయత్నిద్దాం అంటే ఎంతో కొంత నగదు చెల్లించాల్సిందే.. అయితే మీ కోసం ఉచితంగా కోర్సులు అందించే ఓ వెబ్‌సైట్ ఉంది. పేరు www.openculture.com ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులు ఆన్‌లైన్‌లో ఉచితంగా నేర్చుకోవచ్చు. సినిమా, ఫొటోగ్రఫీ, చదువు, వంట, ఆరోగ్యం, జర్నలిజం, వ్యాపారం, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, తదితర సుమారు 1500 కోర్సులు ఉచితంగా నేర్చుకోవచ్చు. అంతేకాదు ఆడియో బుక్స్ చదివేయొచ్చు. సినిమాలూ చూసేయొచ్చు.
కథనాలు చదివేయండి
మీకు ఆర్ట్ అంటే ఇష్టమా? ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలనుందా? మైక్రోబయోలజీ కథనాలు చదవాలనుందా! కానీ ఆ కథనాలకోసం ఇంటర్నెట్‌లో గంటల తరబడి విహరించేస్తున్నారా! అయితే మీకా శ్రమ అక్కర్లేదు. ఈ వెబ్‌సైట్ తెరవండి చాలు. పేరు nautil.us. మీకు నచ్చిన టాపిక్‌లో అనేక కథనాలు అందుబాటులో ఉంటాయి. ఎంచుకుని చదవొచ్చు. అంతేకాదు, ఒక అంశం గురించి వీలైనంతలోతుగా సమాచారం తెలుసుకోవచ్చు. ఓ సారి ప్రయత్నించండి.
వంట చేసేయండలా!
వంటకు సరిపడా అన్ని పదార్థాలు ఇంట్లో లేవా! అయినా పర్లేదు, మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే వంట పూర్తి చేయొచ్చు. అదెలా సాధ్యం అంటారా? ఈ వెబ్‌సైట్‌తో అది సాధ్యమే. పేరు SuperCook. మీ వంటిట్లో ఏమేం పదార్థాలున్నాయో సింపుల్‌గా ఈ వెబ్‌సైట్‌కి చెప్పండి చాలు. ఆ పదార్థాలతో ఎలాంటి వంటలు, ఎన్ని రకాల వంటలు చేయొచ్చో చెబుతుంది. అంటే ఉన్న పదార్థాలతోనే పసందైన విందును ఆరగించవచ్చన్న మాట. అంతేకాదు, వంట ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరణ ఇస్తుంది. ఒక వేళ వంట రాకపోయినా నేర్పుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
ఇదొక ‘లంచం.. మంచం ప్రభుత్వం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య