Passport : అక్కడ రోడ్డు దాటాలంటే పాస్‌పోర్టు కావాల్సిందే!
రోడ్డు దాటడానికి కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాలి అంటే.. ఇదెక్కడి రూల్ అనుకుంటున్నారా? అమెరికా-కెనడా దేశాల సరిహద్దులోని ప్రజలు ఇలాంటి అనుభవాన్ని రోజూ ఎదుర్కొంటున్నారు. ఆ విచిత్రం ఏంటో మీరూ తెలుసుకోండి!
(Image : google)
ఒకే రోడ్డుపై రెండు దేశాలు ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ దేశాలే అమెరికా(America)-కెనడా(Canada). అమెరికా ఉత్తర సరిహద్దు చాలా వరకు కెనడాతో పంచుకుంటుంది. 9వేల కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దు.. ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దు(international border)గా పేరు పొందింది. ఈ రెండు దేశాల మధ్య 100కు పైగా బార్డర్ క్రాసింగ్స్ ఉన్నాయి. అందులో 15 అమెరికా రాష్ట్రమైన వెర్మోంట్, కెనడా ప్రావిన్స్‌లోని క్యూబెక్ మధ్య ఉన్నాయి. వీటిలో అమెరికాలోని డెర్బైలైన్ పట్టణం, కెనడాలోని స్టాన్‌స్టెడ్ పట్టణాల మధ్య ఉన్న బార్డర్ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే ఈ సరిహద్దు ఇళ్లను మాత్రమే కాదు అర కిలోమీటరు వరకు రోడ్డును కూడా విభజిస్తూ ఉంటుంది. దీనిని కానుసా స్ట్రీట్(Canusa Street)గా పిలుస్తుంటారు. ఇక్కడ ఇరుగుపొరుగు సైతం వేర్వేరు దేశాలకు చెందిన వారై ఉంటారు.
ఎక్కడ పేచీ పడింది?
కెనడాలో న్యూ ఫ్రాన్స్, ద ఫ్రెంచ్ కాలనీలను బ్రిటిష్(British) వారు ఆక్రమించారు. ఆ రెండు వలస రాజ్యాల గవర్నర్లు తమ సరిహద్దులను నిర్ణయించాల్సిందిగా సర్వేయర్లను నియమించడంతో ఈ తికమకకు బీజం పడింది. 1771-73 మధ్య కాలంలో సర్వేయర్లు 45 డిగ్రీల అక్షాంశానికి సమాంతరంగా గీత గీశారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారు. దాంతో కొన్ని చోట్ల సరిహద్దును కాదని 1.5 కిలోమీటర్ల మేర తప్పుగా గీశారు. 1783లో అమెరికా రివల్యూషనరీ వార్ తరువాత ఈ బార్డర్‌పై ఒక సంధి మాత్రం జరిగింది.
1800 సంవత్సరంలో కొందరు సర్వేయర్లు జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. సరిహద్దు అమెరికా దక్షిణ భాగానికి జరగాల్సి ఉందనే అంచనాకు వచ్చారు. అమెరికా, కెనడాలోని బ్రిటిష్ వలస రాజ్యాల మధ్య పలుమార్లు తలెత్తిన సరిహద్దు వివాదాలకు 1842లో ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. అదేంటంటే అప్పుడు ఎలా ఉన్న సరిహద్దులను అలాగే కొనసాగించాలని. ఆ తరువాత 1908లో యూకే, యూఎస్ కలిసి ఇంటర్నేషనల్ బౌండరీ కమిషన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. సర్వే, నిర్వహణ బాధ్యతలు దానికి అప్పగించాయి. అందులోని అధికారులు కూడా పలు ప్రాంతాలతోపాటు, 45వ సమాంతర గీత వద్ద సరిహద్దు గుర్తులను కనిపెట్టలేకపోయారు. అప్పటికే స్థానికులు సరిహద్దుపై పలు చోట్ల నిర్మాణాలు చేపట్టడంతో అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ బౌండరీ కమిషన్ తీవ్రంగా కృషి చేసి కొన్ని మార్గాలను గుర్తించినప్పటికీ కానుసా స్ట్రీట్‌ను మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
(Image : google)
అక్కడి ప్రజల జీవనం ఎలా ఉందంటే..!
చరిత్రకారులు, స్థానికులు చెబుతున్న విషయం ఏంటంటే.. అమెరికా, కెనడా ప్రజలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా పంచుకుంటున్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా అటూఇటూ దాటుతుంటారు. స్టాన్‌స్టెడ్ నుంచి తాగునీరు, మురుగునీటి సరఫరా వంటి సౌకర్యాలు డెర్బైలైన్‌కు అందుతుంటాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా రెండు ప్రాంతాల్లో ఎక్కడ ముప్పు వాటిళ్లినా వెళ్లి సేవలందిస్తుంటారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు కూడా సరిహద్దులు దాటుతుంటారు.
రోడ్డు దాటాలంటే చుక్కలే!
9/11 నుంచి అక్కడ భారీ మార్పులు వచ్చాయి. అప్పటి దాకా సులభంగా ఆ దేశానికి, ఈ దేశానికి మధ్య రాకపోకలు సాగించిన ప్రజలు ఆంక్షల్ని ఎదుర్కొన్నారు. బార్డర్ క్రాసింగ్ ఆఫీసుల్లో సంప్రదించిన తరువాతే రోడ్డు దాటాలని షరతులు విధించారు. ఇరుగుపొరుగు ప్రజల్ని కలిసేందుకు సైతం అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. చెక్ పాయింట్ వద్ద తప్పని సరిగా పాస్‌పోర్టు(passports) చూపించిన తరువాతే రోడ్డు దాటాలని నిబంధన పెట్టారు. ఒక వేళ డ్రైవింగ్ చేస్తుంటే వాహనానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి.
ఉదాసీనంగా ఉంటే అంతే సంగతి
ఆంక్షల్ని పట్టించుకోకుండా రోడ్డు దాటితే మాత్రం భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో అయితే 5వేల డాలర్లు(dollars) లేదా రెండేళ్ల జైలు శిక్ష, కెనడాలో అయితే వెయ్యి డాలర్లు జరిమానా విధిస్తారు. రోడ్డే కదా దాటేస్తే ఎవరు చూస్తారని అనుకోవడానికి వీల్లేదక్కడ. 2015లో పిజ్జా కొనడానికి రోడ్డు దాటి ఓ వ్యక్తి అరెస్టయ్యాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో నివసించే చాలా మందికి రెండు దేశాల్లోనూ ద్వంద్వ పౌరసత్వం(dual citizens) ఉంది. దాంతో వారు చాలా సులభంగా రాకపోకలు సాగిస్తుంటారు.
నడి రోడ్డుపై లైబ్రరీ
ఇదే కాకుండా హస్కెల్ లైబ్రరీ, ఒపెరా హౌస్‌లు సరిహద్దు రోడ్డు పైనే ఉంటాయి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు గుర్తుగా వీటిని 1904లో నిర్మించారు. రెండు దేశాల ప్రజలు వేర్వేరు ప్రవేశ మార్గాల ద్వారా ఇందులోకి రావచ్చు. 2017లో ట్రంప్ పలు ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన తరువాత ఇరాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఈ లైబ్రరీలో ప్రవేశించి తమ స్నేహితులను కలుసుకొనేవారట. అమెరికాకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలువురు కెనడా గుండా ఆ దేశంలోకి వెళ్లేందుకు ఈ సరిహద్దును ఎంచుకుంటారు. 2021లో 916 మంది అలా అక్రమంగా ప్రవేశించడానికి యత్నిస్తూ దొరికిపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు