Dolphin Army: ఉక్రెయిన్ యుద్ధంలో ‘డాల్ఫిన్ ఆర్మీ’.. రష్యా కొత్త ఎత్తుగడ!
ఉక్రెయిన్‌పై జరుపుతోన్న యుద్ధంలో పైచేయి సాధించేందుకు రష్యా డాల్ఫిన్ ఆర్మీని (శిక్షణ ఇచ్చిన డాల్ఫిన్‌లు) రంగంలోకి దించింది.
మాస్కో: ఉక్రెయిన్‌పై జరుపుతున్న యుద్ధంలో పైచేయి సాధించేందుకు రష్యా తన వనరులను అన్నింటినీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే డాల్ఫిన్ ఆర్మీని (శిక్షణ ఇచ్చిన డాల్ఫిన్‌లు) రంగంలోకి దించినట్లు సమాచారం. నల్ల సముద్రంలోని తన నావికా స్థావరాన్ని సురక్షింతంగా ఉంచుకోవడానికి ఈ శిక్షణ ఇచ్చిన డాల్ఫిన్‌లను మోహరించింది. నీటి అడుగున జరిగే దాడులను ముందుగానే పసిగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా నావికా శిక్షణా కేంద్రం (USNI) ప్రకారం.. నల్ల సముద్రంలోని సెవాస్తోపొల్ నౌకాశ్రయంలో రెండు డాల్ఫిన్ స్థావరాలు ఉన్నట్లు తేలింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అవి శిక్షణ పొందిన డాల్ఫిన్‌లేననే అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఈ శిక్షణ పొందిన డాల్ఫిన్‌లను నౌకా స్థావరానికి రష్యా తరలించినట్లు భావిస్తున్నారు.
డాల్ఫిన్‌లే ఎందుకు..?
ప్రతిధ్వనుల సాయంతో నీటి అడుగున వస్తువుల జాడను (సోనార్) డాల్ఫిన్‌లు స్పష్టంగా గుర్తించగలవు. ఈ సహజ లక్షణం కారణంగా నీటి అడుగున శత్రువులు లేదా దాడికి వినియోగించే ఏమైనా వస్తువులు ఉంటే వెంటనే పసిగట్టే వీలుంటుంది. డాల్ఫిన్‌లకు ఇటువంటి వాటిపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు, కెమెరాలు అమర్చి సముద్రం అడుగున పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. తద్వారా శత్రు కదలికలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉంటుంది.
రష్యా సైన్యానికి సెవాస్తొపొల్ నౌకా స్థావరం ఎంతో కీలకమైనది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాకు ఇది అత్యంత చేరువలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రష్యాకు చెందిన భారీ నౌకలు నిలిపి ఉంటాయి. క్షిపణి పరిధిని చేరుకోలేని ఈ ప్రదేశానికి నీటి అడుగున దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు రష్యా అనుమానిస్తోంది. అటువంటి దాడులు జరుగకుండా తమ నౌకలను రక్షించుకోవడమే కాకుండా శత్రు కదలికలను ముందుగానే గుర్తించేందుకు శిక్షణ ఇచ్చిన సముద్ర ప్రాణులను రష్యా సైన్యం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
అమెరికా, ఉక్రెయిన్‌లు కూడా..
కోల్డ్‌వార్ సమయంలోనూ అమెరికా, సోవియట్ యూనియన్‌లు సముద్రం అడుగున పేలుడు పదార్థాల కదలికలను గుర్తించేందుకు వీలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాయి. అమెరికా సైన్యం 1959 నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తోంది. వివిధ సముద్ర ప్రాణులపై ప్రయోగాలు చేసినప్పటికీ ప్రస్తుతం డాల్ఫిన్‌లు, కాలిఫోర్నియా సీ లయన్ (California sea lion)కు మాత్రమే ఇటువంటి శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం అమెరికా మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. గతంలో ఉక్రెయిన్ సైన్యం కూడా సెవాస్తోపొల్ సమీపంలోని భారీ అక్వేరియాల్లో డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చింది. అయితే, 2014 క్రిమియా ఆక్రమణ సమయంలో ఆ క్షీరదాలు రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయి. తిరిగి వాటిని తెచ్చుకోవడంలో ఉక్రెయిన్ విఫలం కాగా.. రష్యా మాత్రం వాటి సంఖ్యను మరింత పెంచుకుంది.
డాల్ఫిన్లే కాదు, ఇతర ప్రాణులకూ..
సముద్ర ప్రాణుల్లో కేవలం డాల్ఫిన్‌లకే కాకుండా ఇతర జంతువులకు రష్యా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. నార్వే తీర ప్రాంతంలో గుర్తించిన తిమింగలానికి (Beluga Whale) రష్యా శిక్షణ ఇచ్చినట్లు ఇదివరకు వెల్లడైంది. వాటికి అమర్చిన ప్రత్యేకమైన పట్టీలను గుర్తించిన మత్స్యకారులు వాటికి కెమెరాలు కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్పందింస్తూ లక్ష్యాలను గుర్తించడానికి వీలుగా వాటికి కొత్త పరికరాలు అమర్చిన విషయాన్ని రష్యా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఇలా సైనిక అవసరాల్లో భాగంగా డాల్ఫిన్‌లకు శిక్షణ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్న రష్యా.. సిరియా యుద్ధం సమయంలోనూ వీటిని ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pawan kalyan: పవన్ షూ రూ.లక్ష.. అక్షయ్ బ్యాక్‌ప్యాక్ రూ.35వేలు.. ఇదే టాక్ ఆఫ్ ది టౌన్!
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరీ
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!