Skyscrapers: ప్రపంచంలో నేలమట్టమైన ఆకాశహర్మ్యాలు ఇవే..!
ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన నోయిడా జంట టవర్లు (Noida Twin Towers) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు నేలమట్టమయ్యాయి. వంద మీటర్ల ఎత్తయిన భవంతులను కూల్చివేసే ఘటనను యావత్ దేశం ఆసక్తిగా గమనించింది. ఇంత పెద్ద భవంతులను కూల్చివేయడం ఇక్కడ ఇదే తొలిసారి. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇటువంటి భారీ భవంతులను కూల్చివేసిన ఘటనలు అనేకం. ప్రపంచంలోనే ఎత్తయిన భవనాల్లో ఒకటైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Centre) ఉగ్రవాదుల చేతిలో కుప్పకూలగా.. వివిధ కారణాల వల్ల నేలమట్టమైన ఆకాశహర్మ్యాల్లో కొన్నింటిపై ఓసారి లుక్కేద్దాం.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Centre)
సెప్టెంబర్ 11, 2001న ప్రపంచ వాణిజ్య కేంద్రం (World Trade Center)కు చెందిన ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో జంట భవనాలు మొత్తం కుప్పకూలిపోయాయి. నాటి మారణహోమంలో 2,753మంది న్యూయార్క్ పౌరులు మరణించగా.. సుమారు 25వేల మందికి పైగా గాయపడ్డారు.
డాయిష్‌బ్యాంక్ బిల్డింగ్ (Deutsche Bank Building)
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఈ 39 అంతస్థుల బ్యాంకు భవనాన్ని 2007-2011 మధ్య కాలంలో కూల్చివేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎదురుగా ఉంటుంది. 2001లో ఉగ్రదాదుల దాడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన సందర్భంగా ఈ బిల్డింగ్ కూడా దెబ్బతింది. దీంతో ఈ భవంతిని కూల్చివేయాలని నిర్ణయించిన అధికారులు.. ఆ ఘటన జరిగిన దశాబ్దం కాలం తర్వాత పూర్తిచేశారు.
270 పార్క్ లేన్ (270 PARK AVENUE)
న్యూయార్క్ నగరానికి దగ్గర్లోని మాన్‌హట్టన్ టౌన్‌లోని పార్క్ లేన్ భవనాన్ని 1961లో నిర్మించారు. అమెరికాలోని ప్రముఖ బ్యాంక్ జేపీ మోర్గాన్ కేంద్రం ఈ భవనంలోనే కొనసాగింది. 215 మీటర్ల ఎత్తయిన ఈ భవంతిని కూల్చివేసి అదేచోట కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2021లో దీని కూల్చివేత పూర్తయ్యింది.
సింగర్ బిల్డింగ్ (Singer Building)
అమెరికాలోని న్యూయార్క్‌లో సింగర్ బిల్డింగ్ ఉండేది. 1960 దశకంలో న్యూయార్క్ నగరంలోనే అతి ఎత్తయిన భవనం అది. అంతేకాదు, అంతకుముందు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవంతిగానూ (41 ఫోర్లు) రికార్డు నమోదు చేసుకుంది. అయితే, పాత కట్టడం కావడంతో దీనిని 1969లో నేలమట్టం చేశారు.
మారిసన్ హోటల్ (Morrison Hotel)
అమెరికా షికాగోలోని మారిసన్ హోటల్‌ను 1965లో కూల్చివేశారు. 160 మీటర్ల ఎత్తయిన ఆ భవనం ప్రపంచంలోనే భారీ భవంతుల్లో ఒకటిగా ఉండేది. అంతేకాకుండా ఈ స్థాయి భారీ భవనాన్ని కూల్చివేయడం కూడా ప్రపంచంలో అదే తొలిసారి కావడం గమనార్హం. అనంతరం ఇదే ప్రాంతంలో 259 మీటర్ల ఎత్తులో 60 అంతస్థుల (Chase Tower) భారీ భవనాన్ని నిర్మించారు. 1969లో ఈ నూతన భవన నిర్మాణం పూర్తయ్యింది.
యూఐసీ బిల్డింగ్ (UIC Building)
సింగపూర్‌లోని యునైటెడ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ బిల్డింగ్ నిర్మాణం 1973లో పూర్తయ్యింది. అప్పట్లో ఆగ్నేయాసిలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటిగా నిలిచింది. 40 అంతస్థుల ఆ భవనాన్ని 2013లో కూల్చివేశారు.
ఆక్సా టవర్ (AXA Tower)
సింగపూర్‌లో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఆక్సా టవర్ కూడా ఒకటి. దాని ఎత్తు 234.7 మీటర్లు. అయితే, దీన్ని కూల్చివేసేందుకు ఇటీవలే నిర్ణయించారు. దీంతో మే 2022 నుంచి మూసివేశారు. అదే ప్రాంతంలో 305 మీటర్లు (1001 అడగుల) ఎత్తయిన భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. సింగపూర్‌లోనే 171 మీటర్ల ఎత్తయిన సీపీఎఫ్ భవనాన్ని 2017లో నేలమట్టం చేశారు. వీటితోపాటు సింగపూర్‌లోనే మరో భారీ భవనం ఫ్యుజీ జిరాక్స్ టవర్స్ (165 మీటర్లు)ను 1987లో నిర్మించగా.. ప్రస్తుతం కూల్చివేసే దశలో ఉంది.
మినా ప్లాజా (Mina Plaza)
అబుదాబీలోని అత్యంత ఎత్తయిన భవన సముదాయం మినా ప్లాజా. దీన్ని నాలుగు టవర్లుగా నిర్మించారు. మొత్తం 2,46,000చ.మీ విస్తీర్ణంలో 144 అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనం ఎత్తు 541 అడుగులు. దీన్ని కొన్ని సెకన్ల వ్యవధిలోనే కూల్చివేశారు. షాపింగ్ కేంద్రంగా పేరుపొందిన ఈ ప్రదేశంలో మరో భారీ కట్టడాన్ని నిర్మించే ప్రణాళికలోనే నేలకూల్చారు. ఇలా కారణాలు ఏమైనా ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యాలుగా పేరుగాంచిన వాటిని నేలమట్టం చేసిన ఘటనలు ఉన్నాయి.
నోయిడా ట్విన్ టవర్లు కూలాయిలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్‌లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్‌పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్‌లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్‌కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్‌హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్‌ఇండియాతోనూ బజ్‌బాల్!
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్