Star Sand: ఇసుక రేణువులా.. ఆకాశంలో నక్షత్రాలా!

జపాన్‌లోని ఒకినావా ప్రాంతంలోని ఇరిమోటె ఐలాండ్‌.. చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, అక్కడి ఇసుకలోనే ఓ ప్రత్యేకత ఉంది. మాములుగా ఇసుక రేణువులు ఎలా ఉంటాయి? గుండ్రగానే కదా..! కానీ, ఈ బీచ్‌లో మాత్రం నక్షత్రం ఆకారంలో కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే వీటి ఆకారాన్ని

Published : 21 Oct 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లోని ఒకినావా ప్రాంతంలోని ఇరిమోటె ఐలాండ్‌.. చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, అక్కడి ఇసుకలోనే ఓ ప్రత్యేకత ఉంది. మాములుగా ఇసుక రేణువులు ఎలా ఉంటాయి? గుండ్రగానే కదా..! కానీ, ఈ బీచ్‌లో మాత్రం నక్షత్రం ఆకారంలో కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే వీటి ఆకారాన్ని ఏ మాత్రం గుర్తించలేము. గుండ్రని ఇసుక రేణువుల్లో మిలితమై ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఓ రకమైన ఆల్గే, ప్రోటోజోవా వంటి ఏక కణ జీవులు ఈ సముద్ర ప్రాంతంలో ఉండేవట. అవి చనిపోయిన తర్వాత వాటి శరీరంపై ఉండే కాల్షియం కార్బొనేట్‌ పెంకులు ఇసుకలో కలిసిపోయాయి. అయితే, ఆ పెంకులపై సముద్రపు అలలు ఎగిసిపడుతుడటంతో అవి అరిగిపోయి నక్షత్రం ఆకారంలోకి మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వీటిని జపనీయులు హోషిజునా నో హమా అని పిలుస్తారు. అంటే నక్షత్రం ఆకారంలో ఉండే ఇసుక అని అర్థం. మిల్లీమీటర్‌ సైజులో ఉండే నక్షత్రపు ఇసుక రేణువులు బీచ్‌లో నడుస్తున్నప్పుడు కాళ్లకు అంటుకుపోతాయి. ఇవి ఇంట్లో ఉంటే అదృష్టం కలుగుతుందని జపాన్‌ ప్రజలు నమ్ముతారు. అందుకే, ఈ బీచ్‌ సందర్శనకు వచ్చినప్పుడు నక్షత్రం ఆకారంలో ఉండే ఈ ఇసుక రేణువుల్ని ఇంటికి తీసుకెళ్తుంటారు. వ్యాపారులు వీటిని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తుంటారు. దీంతో ఇవి అంతరించిపోకుండా ఉండటానికి స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు వీటిని ఇంటికి తీసుకెళ్లడాన్ని నిషేధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని