Steroids: ఎవరికి వాటి అవసరం ఉంటుంది?
ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.రాజేశ్వర్
కొవిడ్ రెండోదశలో స్టెరాయిడ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. అందరికీ వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వర్. కరోనా సోకిన వ్యక్తికి ఐదు రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకుంటే వైద్యుల సిఫార్సు మేరకే స్టెరాయిడ్స్‌ను వాడాల్సి ఉంటుందన్నారు. కానీ కొందరు కరోనా రాకముందే ముందస్తుగా స్టెరాయిడ్స్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు స్టెరాయిడ్స్ వినియోగం ఎలా ఉండాలి?ఎవరికి వాటి అవసరం ఉంటుంది? ఏయే జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్న విషయాలపై డా.రాజేశ్వర్‌తో ముఖాముఖి.
ప్రధానంగా స్టెరాయిడ్స్ ఎలా వాడుతారు? వాటి నియమ నిబంధనలు ఏమిటి?
* కొవిడ్ లక్షణాలు మొదలయ్యాక 5 నుంచి 7 రోజుల్లో మాత్రమే ఈ స్టెరాయిడ్స్ వాడాలి. కొవిడ్ లక్షణాలు మొదలైన మొదటి వారంలోపల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. మొదటి వారం తర్వాత వైరస్ ఉద్ధృతి తగ్గిపోయి వాపు ప్రక్రియ ఉంటుంది. కాబట్టి 5 నుంచి 7 రోజుల తర్వాత మాత్రమే స్టెరాయిడ్స్ తగినంత మోతాదులోనే వాడాల్సి ఉంటుంది.
* రెండోవారం లోపల స్వల్ప లక్షణాలు ఉన్నట్లైతే.. అంటే మొదటి వారం తర్వాత లక్షణాలు తగ్గి, మళ్లీ రెండోవారంలో మొదలైనట్లైతే.. జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట, తలనొప్పి.. ఇలాంటి సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. దీనికి సరైన మోతాదులో ఉండే ఇతర స్టెరాయిడ్స్ కూడా వాడుకోవచ్చు.
* అదేవిధంగా ఎవరిలోనైనా తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నట్లైతే.. అంటే ఆక్సిజన్ స్థాయి 94 కంటే తక్కువగా విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు, హోం ఐసోలేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు, లేదా చికిత్స తీసుకుంటున్నవారెవరైనా ఆరు నిమిషాలు వాకింగ్ చేశాక 95 కంటే ఐదు శాతం ఆక్సిజన్‌స్థాయి పడిపోయినప్పుడు.. వీరికి బాడీ వెయిట్ చొప్పున స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆక్సిజన్ స్థాయీలు ఎక్కువగా పడిపోతున్నప్పుడు, సీఆర్‌పీ స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు.. ఇలాంటి సమయంలో రెండు మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ప్రతీరోజూ వాడాల్సిన అవసరం ఉంటుంది.
* కొన్ని సందర్భాల్లో నిష్ణాతులైనటువంటి వైద్యులు పల్స్ థెరపీ అని ఇస్తుంటారు. వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడిచేస్తునప్పుడు.. పల్స్‌థెరపీలో ప్రతీరోజూ 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలే తప్ప సొంతంగా వాడకూడదు.
ఇప్పుడు చాలామందికి ఆసుప్రతిలో చేరగానే స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు కూడా స్టెరాయిడ్స్ వాడటం జరుగుతోంది. దీనివల్ల దుష్ర్పభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో వాడినప్పుడు రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి అధికంగా పెరుగుతుంది. అంటే షుగర్ లేనివారికి షుగర్‌వచ్చే ముప్పు ఉంటుంది. షుగర్ ఉన్న వ్యక్తులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి ఫంగస్ ప్రబలే అవకాశం ఉంటుంది. అంటే షుగర్ లెవల్, సీరమ్ కెరటీన్ లెవల్ ఎక్కువ కావడం ఫంగస్ ఎదిగేందుకు ఎరువులా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అదేవిధంగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎక్కువ రోజులు వాడితే.. వారికి బీపీ పెరగడం, కంటి సమస్యలు(కంటిశుక్లాలు), ఎముకలు పెళుసుబారడం, నిద్రపట్టకపోవడం, లావు కావడం, మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఎంతవరకూ వాడాలో తెలుసుకొని సరైన మోతాదులో వాడితేనే మంచిది. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి కొవిడ్-19 సోకినప్పుడు కచ్చితంగా ప్రాణదాతలు. అందుకే వీటిని రెండు వైపులా పదును ఉండే కత్తిలా చెప్పవచ్చు.
షుగర్ ఉన్న వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి వైద్యం ఇచ్చి బ్లాక్‌ఫంగస్ నుంచి కాపాడవచ్చు?
షుగర్, ప్రిడయాబెటిక్ వ్యక్తులు కచ్చితంగా ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని పరీక్షించుకోవాలి. ప్రిడయాబెటిక్‌వారు.. 40-50 వయస్సు ఉన్నవారు.. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను, అలాగే తిన్న తర్వాత పోస్ట్‌లంచ్ బ్లడ్ షుగర్‌ను చూసుకోవాలి. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. తద్వారా మ్యుకర్‌మైకోసిస్‌ను ఎదుర్కోవచ్చు. ఇలా షుగర్ కంట్రోల్‌లో ఉన్నట్లైతే వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫంగస్‌ను ఎదుర్కోవచ్చు. కొవిడ్ సోకిన తరువాత సైనటీస్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఒక్కసారి వైద్యులని కలిసి ఫంగస్ వ్యాధులేమైనా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఎవరిలోనైనా బ్లాక్ ఫంగస్ లక్షణాలు (ముఖంలో ఒకవైపు వాపురావడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, చీదినప్పుడు నలుపు లేదా గోధుమ రంగులోకి రావడం, కంటిగుడ్డు చుట్టు నొప్పి, కంటివాపు) ఉంటే వెంటనే వైద్యుని చేత పరీక్షించుకొని చికిత్స తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు.
కొంత మంది కరోనా భయంతో సొంతంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇలా వాడటం మంచిదేనా? లేదా దీనివల్ల ఇబ్బంది అవుతుందా?
కొవిడ్ నియంత్రణకు చాలా మంది స్టెరాయిడ్స్ వాడుతున్నారు. లక్షణాలు లేకుండా స్టెరాయిడ్స్ వాడితే, ముందుగానే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ ఇన్‌ఫెక్షన్‌లతో పాటు ఇతర బ్యాక్టీరియా, ఫంగస్, టీబీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాలు లేకుండా స్టెరాయిడ్స్ వాడకూడదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
-
Sports News
MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
-
General News
cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
-
Viral-videos News
Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
-
World News
Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌పై రికీ పాంటింగ్ జోస్యం