ఒత్తిడి వల్ల చర్మ సమస్యలొస్తాయ్‌!

ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికి తెలిసిందే. ఒత్తడి ఉంటే తలనొప్పి, రక్తపోటు వంటివి వస్తాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవే కాదు.. ఒత్తిడి వల్ల చర్మానికి అనేక సమస్యలు తలెత్తుతాయట. ఒత్తిడితో హార్మోన్ల సమతుల్యత

Published : 06 Mar 2021 09:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికి తెలిసిందే. ఒత్తడి ఉంటే తలనొప్పి, రక్తపోటు వంటివి వస్తాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవే కాదు.. ఒత్తిడి వల్ల చర్మానికి అనేక సమస్యలు తలెత్తుతాయట. ఒత్తిడితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, దాని కారణంగానే మొటిమలు, దద్దుర్లు రావడం.. జట్టు సన్నబడటం, రాలిపోవడం, ఇతర చర్మ సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

శరీరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసోల్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్‌ను స్ట్రెస్‌ హార్మోన్‌ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో చర్మం బలహీనపడి ముడతలు వస్తాయి. ఈ హార్మోన్‌ చర్మంలోని నూనె గ్రంథుల్ని ప్రేరేపించి అధిక మొత్తంలో నూనెలు విడుదల అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ క్రమంలో చర్మగ్రందులు మూసుకుపోయి మొటిమలు మొదలువతాయి. ఒత్తిడి కారణంగా నిద్ర కరవై కళ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి.

ఒత్తిడి తీవ్రత పెరిగితే చర్మం కింద ఉండే గ్రందులు, ప్రోటీన్ల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోవడం, దురద, దద్దుర్లు వస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే.. ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి చర్మ వ్యాధులు సైతం సోకుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు చర్మంపై ఎవరూ పెద్దగా శ్రద్ధ పెట్టరు. మాయిశ్చరైజర్లు, ఇతర స్కిన్‌ క్రీమ్స్‌ ఉపయోగించరు. దీంతో చర్మం కాంతివిహీనంగా, నిర్జీవంగా మారుతుంది.

పరిష్కారమేంటి?

ఒత్తిడికి గురికావడం సహజం. ఇందుకు అనేక కారణాలుండొచ్చు. అయితే, ఒత్తిడి చర్మంపై ప్రభావం చూపుతుందన్న విషయం గుర్తుంచుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి తగ్గాలంటే అనవసర ఆలోచనలపై మనసు వెళ్లకుండా మీకు నచ్చిన పనులుపై దృష్టి పెట్టాలి. రోజుకు రెండు, మూడు సార్లు నీళ్లతో ముఖం కడుక్కోవాలి. శరీరం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. ఫ్రై, స్పైసీ ఆహారానికి దూరంగా ఉండాలి. విటమిన్‌ ఈ, సీ చర్మానికి ఎంతో అవసరం కాబట్టి.. ఈ విటమిన్లు ఉన్న క్రీమ్స్‌ చర్మానికి రాసుకున్నా.. ఆహార పదార్థాలు తిన్నా సరిపోతుంది. ముఖ్యంగా చర్మం నిర్జలీకరణం కాకుండా ఉండాలి. ఇందుకోసం వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి లేదా ద్రవరూప పదార్థాలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని