సన్‌ గ్లాసెస్‌ను అప్పట్లో‌ అందుకు వాడేవారు

బయటకు వెళ్తున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటారు.. టిప్పుటాపుగా రెడీ అయ్యారా? సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. ఇలా ఏదో ఒక సందర్భంలో మనం సన్‌ గ్లాసెస్‌ను పెట్టుకుంటుంటాం. ఒకప్పుడు సంపన్నులే

Updated : 03 Sep 2020 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బయటకు వెళ్తున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటారు.. టిప్పుటాపుగా రెడీ అయ్యారా? సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. ఇలా ఏదో ఒక సందర్భంలో మనం సన్‌ గ్లాసెస్‌ను పెట్టుకుంటుంటాం. ఒకప్పుడు సంపన్నులే అధికగా వాడే ఈ సన్‌ గ్లాసెస్‌ను ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు దీన్ని ఎవరు? ఎందుకు? ఎప్పుడు ఉపయోగించేవారో తెలుసా??

సన్‌ గ్లాసెస్‌ను మొదట్లో సూర్యకాంతి కళ్లల్లో పడకుండా ఉండటానికి వాడలేదు. ముఖంలో హావాభావాలు కనిపించకుండా ఉండటం కోసం ఉపయోగించారట. 12వ శతాబ్దం అంతకన్న ముందు నుంచే చైనాలో వీటిని వాడటం మొదలుపెట్టారు. చైనా కోర్టులో న్యాయమూర్తులు మాత్రమే వీటిని ఉపయోగించేవారట. నిందితులను విచారిస్తున్నప్పుడు.. తీర్పులు చెబుతున్నప్పుడు న్యాయమూర్తులు తమ ముఖంలో హావాభావాలు ఎదుటివారికి కనిపించకూడదని దాదాపు సగం ముఖం కప్పిఉంచేలా పెద్ద కళ్లద్దాలను వాడేవారట. 

అయితే 1752 కాలంలో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్‌ ఇస్కో అనే శాస్త్రవేత్త కళ్లద్దాలను రంగుల్లో తయారు చేయడం మొదలుపెట్టాడు. పసుపు, గోధుమ రంగు కళ్లద్దాలు సూర్యకాంతి కళ్లపై పడకుండా నిలువరించగలవని కనుగొన్నారు. అయితే 19 శతాబ్దంలో సిఫిలిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఈ రంగు కళ్లద్దాలను పెట్టుకోమని వైద్యులు సూచించేవారట. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎక్కువ వెలుతురును చూడలేరని అప్పట్లో నమ్మేవారు. 

ప్రస్తుతం వాడుతున్న సన్‌ గ్లాసెస్‌ను మాత్రం బ్రిటన్‌కు చెందిన క్రూకర్స్‌ లెన్సెస్‌ కంపెనీ 1913లో రూపొందించింది. సెరియమ్‌ అనే రసాయన మూలకంతో ఈ సన్‌గ్లాసెస్‌ను తయారు చేసేవారు. ఇది సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను నిలువరిస్తుందట. అయితే అప్పట్లో వీటిని కేవలం కొంతమంది మాత్రమే వాడేవారట. 1919లో అమెరికాలో ఫోస్టర్‌ గ్రాంట్‌ అనే కంపెనీ కళ్లద్దాలను తయారు చేయడం ప్రారంభించింది. 1920 కాలంలో కేవలం సంపన్నులు, సినీతారలు మాత్రమే సన్‌గ్లాసెస్‌ను వాడేవారట. 1929లో ఇదే సంస్థ పెద్దమొత్తంలో సన్‌గ్లాసెస్‌ తయారు చేయడంతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సన్‌గ్లాస్‌లు వివిధ ధరల్లో.. రకరకాల రంగుల్లో, డిజైన్లలో మనకు అందుబాటులో ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు