Updated : 10/11/2021 11:13 IST

Celebrities: వీళ్లు సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ప్రచారరథ సారథులు కూడా!

తారలు ట్రెండ్‌ సృష్టిస్తే.. అభిమానులు ఫాలో అవుతారు... వాళ్ల పేరు, ఫేమ్‌ అలాంటిది మరి! అందుకే సెలబ్రిటీలతో వాణిజ్య ప్రకటనలు రూపొందించడానికి కంపెనీలు ఎగబడతాయి. ఓవైపు ఈ యాడ్స్‌లో నటిస్తూనే.. సమాజానికి ఉపయోగపడే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారకర్తలుగా మారుతున్నారు కొందరు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ని ‘వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌’ పథకానికి అంబాసిడర్‌గా నియమించింది. మిగతా పథకాలు, కార్యక్రమాలకు ప్రచారకర్తలుగా ఉన్న తారల వివరాలు..

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌: ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ ప్రచార సారథి. నగరాల్లోని వ్యర్థాల నుంచి తయారు చేసే సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించే ‘సిటీ కంపోస్ట్‌ క్యాంపెయిన్‌’కి ప్రచారం చేస్తోంది.

అక్షయ్‌ కుమార్‌: రోడ్డు భద్రతా ప్రచార కార్యక్రమాల అంబాసిడర్‌.

అమితాబ్‌ బచ్చన్‌: గుజరాత్‌ రాష్ట్ర పర్యాటకశాఖ అంబాసిడర్‌. స్వచ్ఛభారత్‌ మిషన్‌ సిటీ కంపోస్ట్‌ క్యాంపెయిన్‌ ప్రచారకర్త.

కత్రినా కైఫ్‌: ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున ప్రచారం నిర్వహిస్తోంది. మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు డ్రాపవుట్‌ కాకుండా నిరోధించడం ఈ కార్యక్రమ ఉద్దేశం.

షారూఖ్‌ఖాన్‌: బాలీవుడ్‌ బాద్‌షా పశ్చిమ్‌ బంగా రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌. ప్రభుత్వం ఏ కార్యక్రమం, పథకం ప్రవేశపెట్టినా ప్రచారం చేయడానికి తన సేవలు ఉపయోగించుకుంటుంది.

ఎం.ఎస్‌.ధోనీ: భారత సైన్యం ధోనీకి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదానిచ్చి గౌరవిస్తే ధోనీ ఇండియన్‌ ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నాడు. దీంతోపాటు ఝార్ఖండ్‌ రాష్ట్ర పర్యాటకశాఖ ప్రచారకర్త.

వరుణ్‌ ధావన్‌: ‘సూయీ ధాగా’ సినిమాతో కుటీర పరిశ్రమల ఔనత్యాన్ని చాటిన వరుణ్‌ని ‘స్కిల్‌ ఇండియా క్యాంపెన్‌’ ప్రచారకర్తగా నియమించింది కేంద్రం.

సురేశ్‌ రైనా: ఘజియాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోసం స్వచ్ఛ భారత్‌ ప్రచార సారథిగా పని చేస్తున్నాడు.

సునీల్‌ శెట్టి: నిజమైన క్రీడా ఔనత్యాన్ని పెంచేందుకు నిషేధిత డ్రగ్స్‌, ఉత్ప్రేరకాలు వాడకుండా చూసేదే నేషనల్‌ యాంటీ డోపింగ్‌ అసోసియేషన్‌ (నాడా) దీనికి ప్రచార రాయబారి సునీల్‌ శెట్టి.

సాక్షి మాలిక్‌: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ‘బేటీ బచావో.. బేటీ పఢావో’. దీనికి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ దీనికి అంబాసిడర్‌.

మాధురీ దీక్షిత్‌: పిల్లలకు తల్లిపాలు పట్టడం ఆవశ్యకతపై ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం ‘మమతా అభియాన్‌’. దీనికి అలనాటి మేటి నటి మాధురీ దీక్షిత్‌ ప్రచారం చేస్తోంది.

కుల్దీప్‌ యాదవ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల సంఘం బ్రాండ్‌ అంబాసిడర్‌. ఎన్నికల్లో ఓటు ఆవశ్యకతపై రూపొందిన వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంటున్నాడీ క్రికెటర్‌.

దీపికా పదుకొణె: కొన్నేళ్ల కిందట తీవ్రమైన మానసిక కుంగుబాటుకి గురై ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది బాలీవుడ్‌ నటి దీపికా. ఆ దశ నుంచి ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ అంబాసిడర్‌గా మారింది.

పీవీ సింధు: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అవినీతి వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి రాయబారి.

దియా మీర్జా: వన్యప్రాణుల సంరక్షణ, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌, స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ప్రత్యేకంగా యువత కోసం మొదలుపెట్టిన స్వచ్ఛ్‌ సాథీ ప్రచారకర్త.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని