Kenya Drought: కెన్యా దుర్భిక్షానికి.. మూగజీవాల మృత్యుఘోష..!
తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాలో ప్రజలే కాకుండా జంతువులు కూడా దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి.
హృదయ విదారకంగా వన్యప్రాణుల మరణాలు
నైరోబి: తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాలో ప్రజలే కాకుండా జంతువులు కూడా దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అక్కడి వన్యప్రాణులపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తాగేందుకు చుక్కనీరు దొరక్క అల్లాడిపోతున్న వన్యప్రాణులు.. అడుగు ముందుకు వేయలేక, ఎక్కడికక్కడే విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదలిస్తున్నాయి. తాజాగా కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నీటి కోసం అల్లాడిన జిరాఫీలు.. చివరకు ప్రాణాలు కోల్పోయి గుంపులుగా పడివున్న దృశ్యాలు అక్కడి కరవు కాటకాలకు అద్దం పడుతున్నాయి.
గతకొంత కాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి అక్కడి వాజిర్ కౌంటీలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులకు ప్రాణసంకటంగా మారాయి. ఎక్కడ చూసినా తిండి, నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన జంతువుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న కొన్ని జిరాఫీలు నీటి కోసం తీవ్రంగా వెతికాయి. చివరకు బురదగా మారిన ఓ నీటి కుంటవద్దకు వెళ్లిన మూగజీవాలు అక్కడే కూరుకుపోయాయి. అనంతరం తిండి, నీరు లేక అక్కడే జీవితాన్ని చాలించాయి. అలా ఓ ఆరు జిరాఫీలు ఒకేచోట విగత జీవులుగా పడివున్న హృదయ విదారక దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కేవలం ఇవే కాకుండా ఎన్నో వందల వన్యప్రాణులు ఆహారం, నీరు దొరక్క తనువు చాలిస్తున్నట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి.
జాతీయ విపత్తు..
తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న కెన్యాను కరవు పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో గత సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం కంటే 30శాతం తక్కువ నమోదైంది. దీంతో అక్కడ కరవు పరిస్థితులు తీవ్రమయ్యాయి. చుక్క నీటి కోసం అక్కడి ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఇదే సమయంలో పెంపుడు జంతువులకు స్థానికులు కాస్త ఆహారం, నీరు అందిస్తున్నప్పటికీ.. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చే వన్యప్రాణులను మాత్రం అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వేల సంఖ్యలో వన్యప్రాణులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ఇలా క్షామ పరిస్థితుల కారణంగా గరిస్సా కౌంటీ సమీప ప్రాంతంలోనే దాదాపు 4వేల జిరాఫీల ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అక్కడి స్థానిక మీడియా ది స్టార్ వెల్లడించింది. ఇదిలాఉంటే, దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న కెన్యాలో.. కరవును జాతీయ విపత్తుగా సెప్టెంబర్ నెలలో కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్‌లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్‌పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్‌లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్‌కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్‌హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer).
తాజా వార్తలు (Latest News)
-
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ
-
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
-
Chhattisgarh Election Results: ఛత్తీస్‌గఢ్‌లో మోదీ మ్యాజిక్‌తో భాజపా జోరు
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
-
Assembly Election Results: మూడు రాష్ట్రాల్లో భాజపా జోరు.. ట్వీట్ చేసిన మోదీ
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా