Offbeat: కూరలో మనం మసాలా వేస్తే.. వాళ్లు మట్టి వేస్తారు!

ఘుమఘుమలాడే కూరలు వండాలంటే.. అందులో మసాలా వేయాల్సిందే. వాటిని కలిపితే కానీ వంటకు రుచి రాదు. భారతీయులైతే మసాలా లేకుండా వంటను ఊహించలేరు. వివిధ దేశాల ప్రజలు కూడా వారి అభిరుచికి తగ్గట్టు మసాలా మిశ్రమాలను వాడుతుంటారు. అయితే, పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ పరిధిలో

Published : 13 Nov 2021 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఘుమఘుమలాడే కూరలు వండాలంటే.. అందులో మసాలా వేయాల్సిందే. వాటిని కలిపితే కానీ వంటకు రుచి రాదు. భారతీయులైతే మసాలా లేకుండా వంటను ఊహించలేరు. భారత్‌లోనే కాదు, వివిధ దేశాల ప్రజలు కూడా వారి అభిరుచికి తగ్గట్టు మసాలా మిశ్రమాలను వాడుతుంటారు. అయితే, పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ పరిధిలో ఉన్న హర్ముజ్‌ ఐలాండ్‌లోని ప్రజలు మాత్రం మట్టినే మసాలాగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడి మట్టిని వంటలో వేస్తే అద్భుతమైన రుచి వస్తుందట.

ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఈ ఐలాండ్‌లోని పర్వతాలు వివిధ వర్ణాల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రెయిన్‌బో ఐలాండ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి ఒక్కో రంగు పర్వతం ఒక్కో రుచిగల మట్టిని కలిగి ఉంటుంది. దీంతో స్థానిక ప్రజలు ఈ పర్వతాల మట్టిని మసాలా దినుసులు కలిపినట్టు కలిపేసి.. వంటల్లో వేస్తుంటారు. ఇక్కడి మట్టిలో ఐరన్‌తోపాటు 70 రకాల ఖనిజాలున్నాయట. దీంతో ఈ మట్టి మసాలాలు రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఐలాండ్‌లోని పర్వతాల్లో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని, అవే కాలక్రమంలో మట్టిలో కలిసిపోయాయని భౌగోళిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, మట్టికి రుచి ఉండటం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇక్కడి ప్రజలు ఆ రుచిని గుర్తించి వంటల్లో ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ రంగురంగుల పర్వతాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులు కూడా హర్ముజ్‌ ఐలాండ్‌ ప్రత్యేక వంటలను రుచి చూసి ఫిదా అవుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని