Trembling Stone: పే...ద్ద బండరాయి.. అయినా, సులువుగా కదలించొచ్చు!
ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. మనం అలాంటి అద్భుతాల గురించి చాలా వినే ఉంటాం. ఇప్పటికీ చాలా వింతల వెనుక అసలు రహస్యం ఏంటో అంతు చిక్కదు. సరిగ్గా ఆ కోవకు చెందినదే ఈ పే..ద్ద బండరాయి.
ఫ్రాన్స్‌లో కొన్ని వందల టన్నుల బరువైన పెద్ద బండరాయి ఇది. బరువైంది అనగానే మనిషి ఎలాగూ దాన్ని కదలించలేడని ఫిక్స్ అయిపోతాం. కానీ, 132 టన్నుల బరువున్న ఈ రాయిని మనిషి సులువుగా కదలించొచ్చు. నిజమా! అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే. ఈ బరువైన రాయిని ట్రెంబ్లింగ్ స్టోన్ అని పిలుస్తారు. దీన్ని ఈశాన్య ఫ్రాన్స్‌లోని హ్యూల్‌గోట్ అడవిలో కనుగొన్నారు.
ఈ రాయి మనిషి కంటే కొన్ని వేల రెట్లు బరువుగా ఉన్నప్పటికీ ఓ బలహీనమైన వ్యక్తి కూడా దాన్ని సులువుగా కదలించొచ్చు. అయితే, దీన్ని ఒక నిర్దిష్టమైన దిశ నుంచి కదిలించినప్పుడు మాత్రమే ఈ రాయి కదులుతుంది. ఇది కొందరికి అద్భుతంగా అనిపించినప్పటికీ.. పూర్తిగా శాస్త్రీయమైనది. ట్రెంబ్లింగ్ స్టోన్ చదునుగా ఉన్న మరోరాయిపై ఉంటుంది. ఒక మూల నుంచి కదిపితే రాయి పైకి కిందికి ఊగుతుంది. ఈ రాయి ఉన్న ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. దీన్ని వీక్షించటానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. రాయిని కదపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ టెక్నిక్ తెలిసిన వాళ్లకు మాత్రమే రాయి కదులుతుంది.
మన దేశంలోనూ: ఇటువంటి ప్రత్యేకమైన శిల ఒకటి మన దేశంలోనూ ఉంది. తమిళనాడులోని మహాబలిపురంలో సహజసిద్ధంగా ఏర్పడిన కృష్ణా బట్టర్‌బాల్ అనే రాయి.. ఫ్రాన్స్‌లోని ట్రెంబ్లింగ్ స్టోన్ కంటే బరువైంది. దీని మొత్తం బరువు 250 టన్నులు. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలు వచ్చినా ఈ బండరాయి ఒక్క అంగుళం కూడా కదల్లేదట. ఈ రాయిని దగ్గర నుంచి చూసినప్పుడు.. ఏ క్షణంలోనైనా ఈ రాయి దొర్లుతుందోనని అనిపించడం మాత్రం ఖాయం. ఆ బండరాయి ఉన్న ప్రదేశం చాలా ఏటవాలుగా ఉన్నప్పటికీ రాయి ఎందుకు జారడం లేదనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ రాయి ఉన్న ప్రదేశాన్ని 2019లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!