Beast car : ‘బీస్ట్’ లుక్ అదిరింది.. ఏరోప్లేన్ ఇంజిన్ అమర్చిన కారు ఇదే!
వినూత్న ఆలోచనలతో విభిన్న ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయి. అందులో ఈ ‘బీస్ట్’ కారు ఒకటి.
(Image : Car & Classic youtube)
ప్రపంచంలోని కొన్ని ప్రఖ్యాత మోటార్ వాహన కంపెనీలు కేవలం కార్లతోనే సంతృప్తి పడక.. విమానాలు వంటివి కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. బీఎండబ్ల్యూ(BMW) తొలుత ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లనే ఉత్పత్తి చేసేది. బ్రిటిష్ లగ్జరీ కారు కంపెనీ రోల్స్ రాయిస్(Rolls-royce) ఇప్పటికీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు రూపొందిస్తోంది. అది తయారు చేసిన మెర్లిన్ ఇంజిన్ ఎంతో శక్తిమంతమైనదిగా గుర్తింపు పొందింది. 1970వ దశకంలో ఆ ఇంజిన్‌ను అమర్చిన కారు(Car) ఇప్పుడు తాజాగా ఓ వేలంపాటలో నిలిచి వార్తల్లో కెక్కింది. ఇంతకీ ఆ కారు ఎక్కడుంది? ఎప్పుడు తయారు చేశారు? ఎంత వేగం(Speed)గా దూసుకుపోతుందో తెలుసుకోండి మరి.
‘బీస్ట్’గా రిజిస్టర్
బ్రిటన్(Britain)లో ‘బీస్ట్’గా 1972లో రిజిస్టర్ అయిన ఈ కారు తయారీకి 1966లో అడుగులు పడ్డాయి. ఇంగ్లిష్ ఇంజినీరు పాల్ జేమ్స్న్ ఒక స్ట్రీట్ లీగల్ కస్టమ్ కారులో ‘ట్యాంక్ ఇంజిన్’ అమర్చితే ఏం జరుగుతుందో చూడాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నం చేసి కారు ఛాసిస్‌ను తయారు చేశాడు. దానికి రోల్స్ రాయిస్ మిటియోర్ ట్యాంక్ ఇంజిన్‌ను బిగించాడు. ఈ విషయం జాన్ డూడ్కు తెలిసింది. ఆయనకు కూడా ఇలాంటి విషయాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎంతో కుతూహలంతో ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్నాడు. కానీ, ఏమైందో తెలియదు కారు ప్రాజెక్టును జేమ్సన్ మధ్యలోనే వదిలేశాడు. దాంతో జాన్ ఆ కారు తయారీకి సిద్ధమయ్యాడు. కారు విడిభాగాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చడం మొదలుపెట్టాడు.పైకి కనిపించే కారు బాడీని ఫైబర్ గ్లాస్‌తో తయారు చేయించాడు. అలా జాన్ డూడ్ 1972 నాటికి ‘బీస్ట్’ కారును సిద్ధం చేసి రోడ్డుపై నడిపించాడు.
(Image : Car & Classic youtube)
ఈ కారు రోడ్డుపై చాలా వైవిధ్యంగా కనిపించేది. దాంతో ఆ మార్గాన వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులు దీన్ని పరికించి చూసేవారు. సాంకేతికంగా కూడా దీనికి మంచి గుర్తింపు దక్కింది. ఐరోపాలో జరిగిన అనేక టెలివిజన్ కార్యక్రమాల్లో ‘బీస్ట్’ను ప్రదర్శించారు. 1974లో స్వీడన్ నుంచి తిరిగి వస్తుండగా అనూహ్యంగా ఈ కారు ప్రమాదానికి గురైంది. ఓ కారు షోలో పాల్గొని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫలితంగా కారు తుక్కులా మారడంతో జాన్ డూడ్కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఏకంగా ఏరోప్లేన్ ఇంజిన్!
కారు ప్రమాదానికి గురైనా జాన్ డూడ్ అంతటితో ఆగిపోలేదు. మళ్లీ కారుకు పూర్వ రూపం తీసుకురావాలని సంకల్పించాడు. అదే పట్టుదలతో ఈ సారి కారుకు రోల్స్ రాయిస్ 27 లీటర్ల మెర్లిన్ V12 ఏరోప్లేన్ ఇంజిన్ బిగించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన బ్రిటన్ విమానాలకు ఈ ఇంజినే ఉండేది. 750 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో కారు మొత్తం 2280 కేజీల బరువుండేది. గ్యాలన్ ఇంధనం పోస్తే 2 మైళ్లు మాత్రమే మైలేజీ ఇచ్చేది. ఫైబర్ గ్లాస్ రిపేర్స్ అనే కంపెనీ వద్ద బాడీని తయారు చేయించాడు. మొత్తానికి 19 అడుగుల పొడవైన కారు మళ్లీ సిద్ధమైపోయింది. మునుపటి కారు ఆకృతితో పోలిస్తే ఇది మరింత విభిన్నంగా ఉంది. ఈ ప్రత్యేకతల కారణంగా ‘ది మోస్ట్ పవర్ఫుల్ కార్ ఇన్ ది వరల్డ్’గా 1977లో గిన్నిస్ రికార్డుకెక్కింది. అప్పట్లో ఈ కారు గంటకు 418 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేదనే ప్రచారం జరిగింది. కానీ, దీని అసలైన వేగం ఎంతో ఇప్పటికీ తెలియరాలేదు.
కడ వరకు తనతోనే..
జాన్ డూడ్ ‘బీస్ట్’ను తమ కంపెనీ కారుగా ప్రచారం చేసుకుంటున్నాడని రోల్స్ రాయిస్ దావా వేసింది. ఆ కేసులో కంపెనీయే పై చేయి సాధించింది. ఈ ఘటన తరువాత జాన్ బ్రిటన్ను వదిలి స్పెయిన్‌లో స్థిరపడ్డాడు. తాను ఎంతో ప్రేమించే ప్రియమైన కారును కూడా తన వెంట తీసుకెళ్లాడు. దాన్ని ఎప్పుడూ విక్రయించేందుకు యత్నించలేదు. చివరి శ్వాస వరకు ఆ కారును అపురూపంగా చూసుకున్న జాన్ గతేడాది మరణించాడు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ పురాతన కారును వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కారు స్పీడో మీటరు రీడింగ్ 16,093 కిలోమీటర్ల వద్ద ఉంది. కండిషన్ కూడా బాగానే ఉంది. దీన్ని 87800 డాలర్లకు విక్రయించినట్లు వేలం కంపెనీ తెలిపింది. భారతీయ కరెన్సీలో ఆ మొత్తం సుమారుగా రూ.72 లక్షలు పైమాటే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్‌లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్‌కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. -
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్‌లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్‌ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వేతన పెంపు!