No Selfie : ఇవాళ ‘నో సెల్ఫీస్ డే’.. మీరు కూడా పాటిస్తారా?
సెల్ఫీ క్లిక్‌లకు ఒక రోజు సెలవు ఇచ్చేందుకు అమెరికాలో ఇవాళ ‘నో సెల్ఫీస్ డే’ను పాటిస్తున్నారు.
మొబైల్(Mobile) ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక్కసారైనా ఓ ‘సెల్ఫీ’(Selfie) తీసుకునే ఉంటారు. అలా సెల్ఫీలు తీసుకోవడం వ్యసనంలా మారిన కొందరు మాత్రం రోజంతా తమ చరవాణి కెమెరా(Camera)లను క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారికి కాస్త విరామం ఇచ్చేందుకే ఇవాళ(మార్చి 16) అమెరికా(America)లో ‘నో సెల్ఫీస్ డే’ను పాటిస్తున్నారు.
ఆయన పుట్టిన రోజు!
ప్రతి సంవత్సరం మార్చి 16ను ‘నో సెల్ఫీస్ డే’గా నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్(Smart phone)లు రాక ముందు నుంచే సెల్ఫీలున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ‘సెల్ఫీ’ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ స్టిక్‌లు, ఫోన్ కెమెరాలోని ఆప్షన్లతో ఫొటోలు తీసుకోవడం సులభంగా మారింది. సెల్ఫీలు తీసుకోవడం మీకు ఎంత ఇష్టమైనా ఇవాళ మాత్రం నో సెల్ఫీడేను పాటించాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ ‘నో సెల్ఫీ డే’ను ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. ఎప్పటి నుంచి పాటిస్తున్నారనే దానికి కచ్చితమైన ఆధారాలూ లేవు. అయితే ఈ రోజునే సెల్‌ఫోన్ కెమెరాను కనిపెట్టిన ఫిలిప్ కాన్ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం. ఇవాళ విపరీతంగా సెల్ఫీలు తీసుకునే వారిని మిగతావారు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే సెల్ఫీ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి.
వ్యసనం కారణంగా వ్యాధి
ఇక సెల్ఫీ వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఒక మహిళ మంచి సెల్ఫీ ఎలా తీసుకోవాలో ఆలోచిస్తూ వారంలో 104 నిమిషాల పాటు కాలం వెల్లదీస్తుందట. నలుగురిలో ఉన్నప్పుడు తమను ప్రత్యేకంగా గుర్తించాలని కూడా కొందరు సెల్ఫీలు తీసుకుంటారని వెల్లడైంది. అలా చేయడం వల్ల ప్రశంసలు లభిస్తాయని సెల్ఫీలు తీసుకునే వారు ఆశిస్తారట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల హవా నడుస్తోంది. సెల్ఫీ తీసుకోవడమే ఆలస్యం అందులో అప్‌లోడ్ చేస్తున్నారు. లైక్‌లు, కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చిన లైట్స్, ఫోన్‌లోని ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ వాడి అసలు రూపం కంటే అందంగా కనిపించడానికి ఆరాటపడుతున్నారు. కొంతకాలం కిందట తీసుకున్న అలాంటి సెల్ఫీలను చూసి అప్పట్లో తాము అందంగా, నాజూకుగా ఉండేవారమనే అభిప్రాయానికి వస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. తాము మునుపటిలా కనిపించడం లేమని బాధపడటాన్ని వైద్యపరిభాషలో ‘డెస్మోర్ఫియా’ అంటారు. వీరు ఎక్కువ సమయం తమ ప్రతిబింబాలను, ఫొటోలను చూసుకుంటూ బాధపడుతుంటారు.
విమర్శిస్తే కుంగుబాటు!
సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీలకు వచ్చే అభినందనలు, విమర్శలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఎవరైనా ఫొటోను డిస్‌లైక్ చేసినా.. అది బాగా లేదని కామెంట్ చేసినా మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు వెల్లడైంది. ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తే ఆ అనుభవాన్ని ఒక రోజు దూరం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఈ ఒక్క రోజు కెమెరాతో కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాలేవైనా కనిపిస్తాయేమో వెతికి వాటిని మనసులో భద్రపరచుకోవడానికి ప్రయత్నించండి!
సెల్ఫీ గురించి కొన్ని విశేషాలు..
- యూఎస్‌కు చెందిన కార్నీలియస్ 1839లో మొట్టమొదటి సెల్ఫీ తీసుకున్నాడు.
- ప్రపంచంలో నిత్యం 9.2 కోట్ల సెల్ఫీలు తీసుకుంటున్నారు.
- సెల్ఫీ తీసుకుంటుంటే 60% మంది నవ్వుతారు.
- సెల్ఫీ తీసుకునే క్రమంలో ఏటా సగటున 43 మంది చనిపోతున్నారు. వేల సంఖ్యలో గాయపడుతున్నారు.
- ‘సెల్ఫీ’ అనే పదం 2013లో వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్