Trending English words:ఈ 10 ట్రెండింగ్‌ ఇంగ్లిష్‌ పదాల గురించి తెలుసా?

సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో ప్రపంచం శరవేగంగా మార్పుచెందుతోంది. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన........

Updated : 23 Nov 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేటి డిజిటల్‌ యుగంలో రోజుకో సరికొత్త ఆవిష్కరణతో ప్రపంచం శరవేగంగా మార్పుచెందుతోంది. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన వేళ జనబాహుళ్యంలోకి రోజూ అనేక కొత్త కొత్త పదాలు వాడుకలోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తోడు వివిధ దేశాల్లో సంస్కృతి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల ఆధారంగా ప్రజలు వాడే భాషలో వస్తోన్న మార్పులతో ఏటా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కొత్త ఆంగ్ల పదాలు వచ్చి చేరుతున్నాయి. అలా 2022లో ట్రెండింగ్‌లో నిలిచిన 10 ఆంగ్ల పదాలు మీకోసం.. 

  1. నోమో ఫోబియా (Nomophobia): మొబైల్ ఫోన్ లేకుండా, దాన్ని వాడకుండా ఉండలేమనే భయాన్ని కలిగి ఉండటం.
  2. షేరెంట్‌ (SHARENT): సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ పిల్లలతో సమాచారం పంచుకొనే తల్లి/తండ్రిని షేరెంట్‌గా పేర్కొంటారు. షేర్‌, పేరెంట్‌ కలిపి షేరెంట్‌గా ఏర్పడింది. 
  3. ఫిన్‌ఫ్లూయెన్సెర్ (FINFLUENCER)‌: డబ్బు సంబంధిత అంశాలపై దృష్టి సారించేలా ప్రభావితం చేసే వ్యక్తిని ఫిన్‌ఫ్లూయెన్సెర్‌గా పేర్కొంటారు. 
  4. ఫిట్‌స్పిరేషన్‌ (FITSPIRATION): ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నేర్చుకొనేందుకు లేదా మెరుగుపరుచుకొనే విషయంలో ప్రేరణగా నిలిచే వ్యక్తి  లేదా వస్తువును గురించి చెప్పినప్పుడు ఫిట్‌స్పెరేషన్‌ పదాన్ని వాడుతున్నారు. ఫిట్‌నెస్‌, ఇన్‌స్పిరేషన్‌ పదాల నుంచి ఫిట్‌స్పిరేషన్‌ ఏర్పడింది. 
  5. స్టాన్‌ (STAN): ఎవరైనా ఒక సెలబ్రిటీ పట్ల అత్యుత్సాహం / అమితంగా ఆరాధించే స్వభావం కలిగిన వ్యక్తిని స్టాన్‌గా పేర్కొంటున్నారు.
  6. ఆసమ్‌సాస్‌ (AWESOMESAUCE): అద్భుతమైనది అని చెప్పే అర్థంలో దీన్ని వాడుతున్నారు.
  7. లో-కీ (LOW-KEY): ఏదైనా ఒక విషయం ఇతరులకు స్పష్టంగా తెలియకూడదని చెప్పే క్రమంలో విశేషణం(adjective)గా ఈ పదాన్ని వాడతారు. అలాగే, తమ గురించి ప్రగల్భాలు చెప్పుకోవడం ఇష్టంలేని వారి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ పదాన్ని వాడొచ్చు.
  8. హ్యాంగ్రీ (HANGRY): బాగా ఆకలి వేయడం ద్వారా మనలో కలిగే కోపం, చిరాకు గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడతారు.
  9. మెటావర్స్‌ (METAVERSE): మెటావర్స్‌ అనేది ఒక వర్చువల్‌ పద్ధతి. దీనిద్వారా కంప్యూటర్‌లో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుని, డిజిటల్‌ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు.
  10. సిట్యుయేషన్‌షిప్‌ (SITUATIONSHIP): ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మిత్రులకు ఎక్కువ, దంపతులకు తక్కువ అని చెప్పేందుకు ఈ పదం వాడుకలో ఉంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని