Eiffel Tower: ఈఫిల్ టవర్ ఎత్తు మరింత పెరిగింది.. ఎందుకో తెలుసా..!
ప్రపంచంలోనే ఎత్తైన ఐరన్ టవర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. ఆకాశానికి తగులుతున్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు (1063 అడుగులు).
ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐరన్ టవర్‌గా ప్రసిద్ధి
పారిస్: ప్రపంచంలోనే ఎత్తయిన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్ టవర్. ఆకాశానికి తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు (1063 అడుగులు). ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్ల (19.69 అడుగుల) డిజిటల్ రేడియో యాంటెన్నాను అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లు అయ్యింది.
130 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టవర్‌ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికిపైగా ప్రపంచ పర్యాటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి ప్రసారాల కోసమూ ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటెన్నా మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటెన్నాను మార్చారు. హెలికాప్టర్ సహాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటెన్నాను కేవలం 10నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు ఆరు మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది.
ఇదిలాఉంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్‌ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్ నిర్మాణం 1889 మార్చి 15నాటికి పూర్తయ్యింది. ‘గుస్తావ ఐఫిల్’కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజినీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్ అనే పేరు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఇది ఈఫిల్ టవర్‌గా మారిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. అసలు కారణమిదే..
-
S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై
-
NIA: ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!
-
TS TET Results: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
NEPAL vs MON: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత
-
Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు.. 19,600 చేరువకు నిఫ్టీ