PRO Jobs: పౌర సంబంధాల రంగంలో ఈ నైపుణ్యాలు ఉండాల్సిందే!
మీరో వస్తువు లేదా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాని గురించి ప్రజలకు తెలిసేదెలా? మీ వస్తువు/కార్యక్రమం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేదెలా? వీటికోసం ప్రతి సంస్థకూ పౌర సంబంధాల(పీఆర్) అధికారులు ఉంటారు. సంస్థ/ప్రభుత్వం ప్రజోపయోగ సమాచారం ప్రజలకు చేరేలా
ఇంటర్నెట్ డెస్క్: మీరు ఒక వస్తువు లేదా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాని గురించి ప్రజలకు తెలిసేదెలా? మీ వస్తువు/కార్యక్రమం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేదెలా? వీటికోసం ప్రతి సంస్థకూ పౌర సంబంధాల(పీఆర్) అధికారులు ఉంటారు. సంస్థ/ప్రభుత్వం ప్రజోపయోగ సమాచారం ప్రజలకు చేరేలా ప్రచారం చేయడంతోపాటు.. దానిపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి యాజమాన్యానికి చేరవేయడంలో పీఆర్ అధికారులదే ముఖ్యభూమిక. అందుకే పౌరసంబంధాల అధికారి(పీఆర్వో) ఉద్యోగాలకు అన్ని రకాల సంస్థలు, వ్యవస్థల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. మరి మీరూ ఈ పీఆర్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? అయితే, ఒక సంస్థ పీఆర్వో కావాలంటే కొన్ని కీలక నైపుణ్యాలు అవసరమవుతాయి. అవేంటంటే..
ఆకట్టుకునే కంటెంట్ రాయాలి
సంస్థ ప్రాజెక్టు ప్రచారానికి పీఆర్వో స్పష్టంగా.. సరళంగా అక్షరరూపం ఇవ్వగలగాలి. సందర్భాన్ని బట్టి.. సమయోచితంగా ఆకట్టుకునేలా విషయాన్ని రాయడం పీఆర్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం.. నైపుణ్యం. అంతేకాదు.. రాసిన దాన్ని ఎదుటివాళ్లు ఎలా అర్థం చేసుకుంటారనే దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఓపికతో వినాలి
సంస్థ ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. ముందుగా ఆ ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకోసం యాజమాన్యం చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి.. అర్థం చేసుకోవాలి. పీఆర్వో సంస్థకు కళ్లు.. చెవులులాంటివాడంటారు. సంస్థ చెప్పే విషయాల్ని తన చెవులతో విని.. ప్రపంచానికి తన కళ్లతో చూపించగలగాలి.
కమ్యూనికేషన్
సంస్థ యాజమాన్యానికి.. బయటి వ్యక్తులకు పీఆర్వో ఒక వారధిలా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యాజమాన్యాన్ని మెప్పించాలన్నా.. క్లయింట్స్/ప్రజలను ఆకట్టుకోవాలన్నా.. మాట్లాడే విధానం బాగుండాలి. అంటే.. కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరమవుతాయి.
చురుకుదనం.. మల్టీ టాస్కింగ్
పీఆర్ అధికారి ఎంత చురుకుగా ఉంటే.. పనుల్లో ఫలితాలు అంత బాగుంటాయి. ఒక్కోసారి బహుళ సంఖ్యలో ప్రాజెక్టులు వస్తే.. మల్టీటాస్కింగ్ చేయాల్సి వస్తుంది. అయినా.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ వారితో పనిచేయించుకోగల సామర్థ్యం కావాలి.
సోషల్‌మీడియాపై పట్టు
ఈ టెక్ యుగంలో సోషల్‌మీడియాను ఉపయోగించని వ్యక్తులుండరు. అందుకే సోషల్‌మీడియా ఈ మధ్య మంచి ప్రచారసాధనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పీఆర్వోకి సోషల్‌మీడియాలో ప్రచారానికి డిజిటల్ కంటెంట్‌ను సృష్టించడంలో పట్టు ఉండటం తప్పనిసరి. ఎప్పటికప్పుడు మారే సోషల్‌మీడియా ట్రెండ్‌ను అనుసరిస్తూ.. కంటెంట్‌ను రూపొందించాలి. అయితే, సోషల్‌మీడియా వేదికలు భిన్నంగా ఉంటాయి. ఏ సోషల్‌మీడియాను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంలో పీఆర్వోకి స్పష్టత ఉండాలి. ఉదాహరణకు యూట్యూబ్‌లాంటి వీడియో సోషల్ మీడియాలైతే వీడియో రూపంలో.. ఇన్‌స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్‌మీడియా వేదికలపై ఫొటో, అక్షరాల రూపంలో కంటెంట్‌ను సృష్టించాల్సి ఉంటుంది.
పరిశోధన
ఏ ప్రాజెక్టుకైతే పీఆర్వోగా పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్టు గురించి లోతుగా పరిశోధన చేయాలి. ఆ ప్రాజెక్టులాంటివే గతంలో ఏమైనా ఉన్నాయా? వాటికి ప్రచారం ఎలా జరిగింది? ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది. తాము చేపట్టిన ప్రాజెక్టులో పీఆర్వో విభాగం విజయవంతం కావాలంటే ఏం చేయాలనే దానిపై పరిశోధించి.. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి.
సమయపాలన
సంస్థ ఒక ప్రాజెక్టును చేపట్టే ముందు వాటి ఖర్చులను.. ఫలితాలు పొందే సమయాన్ని అంచనా వేస్తుంటుంది. అ సమయంలోపే యాజమాన్యం ఆశించిన మేరకు ప్రాజెక్టు గురించి ప్రచారం కల్పించి.. ఫలితాలను రాబట్టాల్సిన బాధ్యత పీఆర్వోపై ఉంటుంది. కాబట్టి అప్పగించిన పనిని ఇచ్చిన సమయంలో ఏ విధంగానైనా పూర్తి చేయాలి. ఇందుకోసం కొన్నిసార్లు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదు.
సృజనాత్మకత
చేసే పని సాదాసీదాగా ఉంటే.. ఎవరూ గుర్తించరు. వాటిలో భిన్నత్వం కనిపించాలి. సృజనాత్మకంగా ఉంటేనే ఎదుటివాళ్ల దృష్టిని మనవైపునకు తిప్పుకోగలం. లక్షిత ప్రజల్లోకి వెళ్లే ప్రచారం ఎంత భిన్నంగా.. ఆకర్షణీయంగా ఉంటే అంత ఆదరణ లభిస్తుంది. కాబట్టి పీఆర్వో ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించాలి.
ఆలోచనలు అంతర్జాతీయ స్థాయి
ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ప్రాంతీయ వ్యాపారాలు కూడా దేశవిదేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్వో ఆలోచనలు ఒక ప్రాంతానికీ పరితమయ్యేలా ఉండకూడదు. అవసరాలకు తగ్గట్టూ ప్రపంచస్థాయిలో రాణించగలగాలి. ఇందుకోసం విదేశాల్లో ఉన్న ట్రెండ్స్ కనిపెట్టి.. దానికి తగ్గట్టు వారి భాషలోనే సంస్థ గురించి ప్రచారం చేయాలి. ఈ క్రమంలో ఇతర భాషలపై కూడా కాస్త పట్టు సాధిస్తే గొప్ప ఫలితాలు సాధించగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tunnel Rescue: రాణిగంజ్ నుంచి ఉత్తర్‌కాశీ దాకా.. చరిత్రలో నిలిచిన సాహసోపేత ఆపరేషన్లు!
భారత్‌లో రాణిగంజ్ బొగ్గుగని ప్రమాదం మొదలు, థాయ్‌లాండ్‌లో గుహలో చిన్నారులు చిక్కుకుపోవడం.. తాజాగా ఉత్తర్‌కాశీ సొరంగం ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. -
Javier Milei: అర్జెంటీనా సమస్యలను తప్పించగలడా.. ఈ ‘పిచ్చాయన’!
అర్జెంటీనాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ సాధించిన జేవియర్ మిలి.. త్వరలోనే దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అలాంటి వలలో పడొద్దు.. ‘పిగ్ బుచరింగ్ స్కామ్స్’పై నితిన్ కామత్ టిప్స్..!
Nithin Kamath tips: పిగ్ బుచరింగ్ స్కామ్స్ దేశంలో పెరిగిపోయాయని జిరోదా సీఈఓ నితిన్ కామత్ అన్నారు. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
Israel: యుద్ధం వేళ.. మరణించిన సైనికుల ‘వీర్యం’ సేకరిస్తున్న కుటుంబీకులు!
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు (Sperm Retrieval) బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
Madhyapradesh Elections: ‘గ్వాలియర్-చంబల్’ సంగ్రామంలో విజయం ఎవరిదో?
కీలక గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకు భాజపా, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
Mizoram Elections: ‘మిజో’ పోరులో విజేత ఎవరో?
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్, ఎంఎన్‌పీ, జడ్పీఎమ్ మధ్య తీవ్ర పోటీ జరగనుంది. అయితే, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? -
India map: భారత చిత్ర పటంలో శ్రీలంక ఎందుకుంటుంది?
Sri lanka: భారత చిత్రపటంలో శ్రీలంకను మీరు గమనించే ఉంటారు. ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? -
Madhyapradesh Elections: కుటుంబాల మధ్య పోరులో విజయం ఎవరిదో?
మధ్యప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పలుచోట్లు పార్టీల మధ్య పోటీ.. కుటుంబాల పోరుగా మారింది. -
Israel: ఇజ్రాయెల్.. ఈ చిన్న దేశం ఎంతో స్పెషల్!
కోటి మంది కూడా లేని ఒక దేశం ప్రపంచం మొత్తానికి అత్యాధునిక టెక్నాలజీని సరఫరా చేస్తోంది. ఈ చిన్న దేశంలో సాంస్కృతిక, చారిత్రక విశేషాలకు కొదవేలేదు. అవేంటో మీరే చదివేయండి.. -
Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?
రాజస్థాన్‌లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి? -
Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి? -
Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ సవాల్!
ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. -
India-Pak War: 1965లో ‘పాక్ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!
సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ హమాస్ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా గతంలో జరిగాయి. -
Israel: ‘ఇనుప గుమ్మటం’లో పగుళ్లు.. ఎందుకిలా?
హమాస్ ఉగ్రవాదుల దాడులతో గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం వణికిపోయింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆత్మరక్షణలో పడిపోయిందన్న అంశాలను విశ్లేషిస్తే.. -
Hamas: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ఏంటీ ‘హమాస్’!
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ భారీ ఎత్తున దాడులు చేసింది. అసలు ఏంటీ ‘హమాస్’? -
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామిన్ సన్నిహితుడు మహ్మద్ ముయిజ్జు గెలుపొందారు. ఈ నేపథ్యంలో చైనా కదలికలు ఎలా ఉండబోతున్నాయి. -
Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!
హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి. -
Canada: నేను చేస్తే రైట్... నువ్వు చేస్తే రాంగ్..!
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అడ్డుకుంటామని కెనడా తదితర దేశాలు చెబుతుంటాయి. అయితే, భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులకు రెడ్‌కార్పెట్ వేసిన కెనడా వైఖరిని చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. -
777 Movies in a year: ఏడాదిలో 777 సినిమాలు చూశాడు.. తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఏమైందటే.. -
Glass Bridge: భారత్‌లోనే అతి పొడవైన గాజు వంతెన చూశారా?
Glass Bridge: కేరళలోని ఇడుక్కిలో గాజు వంతెన ప్రారంభమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి ప్రకృతి సోయగాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ వంతెన ఆకట్టుకుంటోంది. -
Oppenheimer: అణుబాంబును సృష్టించి.. వినాశనానికి చలించి: ఓపెన్‌హైమర్ గురించి తెలుసా?
ఓ శాస్త్రవేత్త.. అణుబాంబు తయారుచేశాడు.. అది సృష్టించిన వినాశనాన్ని చూసి చలించిపోయాడు.. అణుశక్తి మానవ అభివృద్ధి కోసమేగానీ ప్రాణనష్టం కోసం కాదంటూ ప్రచారం చేశాడు. ఆయనే అణుబాంబు పితామహుడు జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer).


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
-
Nayanthara: నయనతారకు విఘ్నేశ్ ఖరీదైన బహుమతి.. అదేంటంటే?