పొగ తాగితే.. 28 రోగాలు
పొగ రాయుళ్లూ.. తస్మాత్ జాగ్రత్త..! వెంటనే ఆ అలవాటు వీడండి. లేకుంటే 28 రకాల రోగాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. పొగ తాగని వారితో పోలిస్తే, 30 శాతం అధికంగా రోగాల..
క్యాన్సర్, గుండె పోటు కూడా..
మెల్బోర్న్: పొగ రాయుళ్లూ.. తస్మాత్ జాగ్రత్త..! వెంటనే ఆ అలవాటు వీడండి. లేకుంటే 28 రకాల రోగాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు.. పొగ తాగని వారితో పోలిస్తే, 30 శాతం అధికంగా రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఓ పది సంవత్సరాలు ముందుగా మరణించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటున్నారు. సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దాదాపు లక్షా 52 వేల 483 మంది రోగుల డేటాను పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. వీరి అధ్యయనాన్ని ‘ఈక్లినికల్ మెడిసన్’ జర్నల్ ప్రచురించింది. రోజుకు పది సిగరెట్లు తాగేవారిని తక్కువ స్థాయి జాబితాలోకి, 10 నుంచి 19 మధ్య తాగేవారిని మధ్యస్థ జాబితాలోకి.. 20 కంటే ఎక్కువ తాగేవారిని ప్రమాదకర జాబితాలో చేర్చింది. రోజూ సిగరెట్ తాగడం వలన క్యాన్సర్, శ్వాస, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. వీటితో పాటు మూత్ర పిండాల వైఫల్యం, న్యుమోనియా, కంటి సమస్యలు, రక్తం విషతుల్యం కావడం.. ఇలా అనేకానేక రోగాలు పొగ తాగేవారిని కబళిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పొగ తాగుతున్న వారి సంఖ్య తగ్గుతున్నా.. ప్రపంచ జనాభాలో పదిహేనేళ్ల పైబడిన జనాభాలో 20 శాతం మందిలో ఇంకా ఈ దురలవాటు ఉందని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలీనా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్‌మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?