ఇళ్లలోనే ఎక్కువమందికి కరోనా సంక్రమణ

బయటి వ్యక్తుల కన్నా ఇంట్లోనే కుటుంబసభ్యుల ద్వారానే వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉందని దక్షిణ కొరియా రోగ విజ్ఞాన నిపుణులు గుర్తించారు.

Published : 23 Jul 2020 10:14 IST

దక్షిణ కొరియా నిపుణుల అధ్యయనం

సియోల్‌: బయటి వ్యక్తుల కన్నా ఇంట్లోనే కుటుంబసభ్యుల ద్వారానే వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉందని దక్షిణ కొరియా రోగ విజ్ఞాన నిపుణులు గుర్తించారు. వీరి అధ్యయనాన్ని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రినెన్షన్‌(సీడీసీ) జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనం కోసం జులై 16నాటికి వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 5,706 మందిని ఎంచుకున్నారు. వారికి ఎవరినుంచి వైరస్‌ సోకిందోనని జాగ్రత్తగా పరిశీలించారు. వారందరి కాంటాక్టులు మొత్తం 59 వేల మంది ఉన్నారు. చివరికి ప్రతి వంద మందిలో కేవలం ఇద్దరికే బయటి వ్యక్తుల ద్వారా వైరస్‌ సోకినట్టు గుర్తించారు. అలాగే ప్రతి పది మందిలో ఒకరు తమ కుటుంబికుల ద్వారానే వైరస్‌ బాధితులుగా మారారని తేలింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts