Updated : 31 Jul 2020 08:18 IST

‘గాంధీ’ వైద్యులే కాపాడారు!

హైదరాబాద్‌: కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందుతోందని ఓ బాధితుడు గురువారం వీడియో సందేశం ద్వారా తెలిపారు. సొంత కుటుంబ సభ్యుల్లా రెండు పూటలా వైద్యులు వచ్చి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారని వివరించారు. ‘ఈనెల 7న తీవ్ర జ్వరం వచ్చింది. కరోనా లక్షణాలు కన్పిస్తే ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించా. పరీక్ష చేయించుకోమని సూచించారు. నాకు పాజిటివ్‌ వచ్చింది. అదే వైద్యుడు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఆ తర్వాతి రోజు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో అదే వైద్యుడు ఏదో ఒక ఆసుపత్రిలో చేరమని సూచించగా, గాంధీ ఆసుపత్రికి వచ్చేశా. ఇక్కడ అత్యవసర మెడికల్‌ కేర్‌(ఏఎంసీ) వార్డులో చేర్పించారు. నాకు ఆక్సిజన్‌ పెట్టారు. తొలుత రెండు రోజులపాటు ఇబ్బంది పడ్డాను. వైద్యులు భరోసా ఇచ్చారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోవడంతో ఆక్సిజన్‌ తొలగించారు. వైద్య సిబ్బంది సొంత కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు. గాంధీలో అన్ని సౌకర్యాలున్నాయి. మంచి వైద్యం లభిస్తోంది అనడానికి నేనే ఉదాహరణ’ అని వివరించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts