Tooth brush: నిద్రమత్తులో టూత్‌బ్రష్‌ మింగేశాడు

రోజూ కంటినిండా సరిపడా నిద్రపోవాలి. అలా కాకుండా నిద్రను నిర్లక్ష్యం చేస్తే వాటి దుష్ర్పభావాలు మరుసటి ఉదయం అనుభవించక తప్పదు. ఇందుకు ఉదాహరణే చైనాలో జరిగిన సంఘటన. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌకు చెందిన ఓ వ్యక్తి.

Updated : 07 Aug 2021 16:10 IST

గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజూ కంటినిండా సరిపడా నిద్రపోవాలి. అలా కాకుండా నిద్రను నిర్లక్ష్యం చేస్తే వాటి దుష్ర్పభావాలు మరుసటి ఉదయం అనుభవించక తప్పదు. ఇందుకు ఉదాహరణే చైనాలో జరిగిన ఈ సంఘటన. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌకు చెందిన ఓ వ్యక్తి..  నిద్రలేచి పళ్లుతోముకుంటున్నాడు. నిద్రమత్తులో ఉన్న అతడు టూత్‌బ్రష్‌ని మింగేశాడు.దీంతో అతని ఆరోగ్యపరిస్థితి మరింత తీవ్రం కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు..ఎక్స్‌-రే తీసి.. అత్యవసర గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు శరీరంలో లోపుల చొచ్చుకుపోయిన బ్రష్ హ్యాండిల్‌ను పట్టుకునేందుకు నానా తిప్పలు పడాల్సివచ్చింది. చాలా సేపు శ్రమించిన అనంతరం బ్రష్‌ను బయటకు తీశారు. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వస్తువును మింగినప్పుడు గొంతులో అడ్డం పడకుండా ఉండేందుకు అన్నం కానీ వెనిగర్‌.. మింగడం చేస్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం సమయస్ఫూర్తితో పాటు మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆస్పత్రికి రావడం అభినందనీయమన్నారు.  కంగారు పడి ఇంటి చిట్కాలతో నయం చేయాలనుకుంటే మాత్రం అతడి ఇసోఫెగస్‌ (అన్నవాహిక) తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండేది. కాబట్టి గొంతులో ఏదైనా ప్రమాదకరమైన మింగితే..వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని