AP News: ఏపీలో ఒమిక్రాన్‌ కలకలం.. ఒక్కరోజే10 కేసులు నమోదు

ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి

Updated : 29 Dec 2021 16:38 IST

అమరావతి: ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 16కి చేరింది. కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు,  కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు వివరించారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. 

రాష్ట్రంలో కొత్తగా 162 కొవిడ్‌ కేసులు..
గడచిన 24 గంటల్లో 31,743 మంది నమూనాలు పరీక్షించగా..  కొత్తగా 186 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా బారి నుంచి 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1049 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని