వందేళ్ల వయసులో..ఓటుకోసం మంచంపై...

తమను పరిపాలించే నాయకులెవరో నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉందంటే అందుకు ఓటు హక్కే కారణం. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవటం పౌరులందరి బాధ్యత.

Published : 07 Nov 2020 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తమను పరిపాలించే నాయకులెవరో నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉందంటే అందుకు ఓటు హక్కే కారణం. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవటం పౌరులందరి బాధ్యత. అయితే కొంతమంది వేర్వేరు కారణాల వల్ల ఓటు వేయటానికి దూరంగా ఉంటారు. మరికొందరు మనకెందుకులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తామొక్కరు ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ..ఆ వృద్ధుడు అలా అనుకోలేదు. వయసు వందేళ్లున్నా, శరీరం సహకరించక మంచానికే పరిమితమైనా, చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకుని ఉన్నా ఓటు వేయటం మాత్రం మానుకోలేదు. తన హక్కును వినియోగించుకోవటంలో వెనక్కి తగ్గలేదు. అతడే బిహార్‌లోని ఖాతిహర్‌ జిల్లాకు చెందిన సుఖ్‌దేవ్‌. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఓటు వేయటంలో ఇతరులు సహకరించారు. మంచంతో సహా పోలింగ్‌ బూత్‌ వద్దకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధ్యతను విస్మరించని సుఖ్‌దేవ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని