100 years old woman:  బామ్మ మాట.. ‘వందేళ్ల’ బాట

జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోకండి.  కచ్చితంగా వందేళ్లు బతుకుతారు

Published : 26 Jul 2021 02:04 IST

చిన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, యవ్వనంలో స్వాతంత్య్ర సమరం.. ఇక వృద్ధాప్యంలో ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. అన్నీ కళ్లారా చూశారు ఆ వందేళ్ల బామ్మ. జీవితానికి నిర్వచనం.. 100ఏళ్లు ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండటానికి ఆవిడ చెప్పే సూత్రాలు తెలిసినవే అయినా..ఆ బామ్మ ఉత్సాహంగా చెబుతుంటే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బామ్మ ఇచ్చే సందేశాలను వీడియో రూపంలో ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది.

‘‘హాయ్‌..! నాపేరు కమల.. నా వయసు 100 ఏళ్లు. నేను రెండో ప్రపంచ యుద్ధం కళ్లారా చూశా. స్వాతంత్ర్య సమరంలో పోరాడాను, ఆ తరువాత స్వాతంత్ర్య సంబరాల్లోనూ పాల్గొన్నా. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాను.. ఇవన్నీ చూసి వచ్చిన నేను..మీరు వందేళ్లు ఆనందంగా ఎలా గడపాలో ఆ సీక్రెట్‌ చెబుతా వినండి’’
* ఎప్పుడైనా సరే ఓపెన్‌ మైండ్‌తో ఉండాలి. ఏ పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయకుండా అంగీకరించాలి.

*  జీవితంలో మార్పులు జరుగుతుంటే భయపడకండి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోండి. కాలానికి తగ్గట్టు మారడం అలవరుచుకోండి.

* అప్పుడప్పుడు పిజ్జా తినండి. అందులో ఉండే కొన్ని కేలరీలు శరీరానికి మంచివి కూడా.

* రోజుకి 30 నిమిషాలు నడవండి.. అలాగే ధ్యానం చేయండి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దు.

* చుట్టూ ఉన్న జనాలు ఏవేవో అంటుంటారు. వాళ్లేమనకుంటారు.. వీళ్లేమనుకుంటారో అని.. వాటిని  లెక్కచేయకండి.

* జీవితాన్ని మరీ సిరీయస్‌గా తీసుకోకండి. కచ్చితంగా వందేళ్లు బతుకుతారు.

కాగా ఈవీడియోని 75లక్షల మంది వీక్షించగా.. 3లక్షల పైగా లైకులతో ముందుకు దూసుకెళ్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని