ఆ రాష్ట్రంలో 106 మంది చిన్నారులకు కరోనా..!

మిజోరంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 520 మందికి వైరస్‌ సోకింది. అయితే వారిలో 106 మంది చిన్నారులు

Updated : 06 Jul 2021 20:19 IST

ఐజ్వాల్: మిజోరంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 520 మందికి వైరస్‌ సోకింది. అయితే వారిలో 106 మంది చిన్నారులు కావడం గమనార్హం. దీంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 21,854కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 98కి చేరినట్లు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఐజ్వాల్ జిల్లా నుంచి 353, కొలాసిబ్‌ నుంచి 76, లుంగ్లీ నుంచి 50 మందికి వైరస్‌ సోకినట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,730 క్రయాశీల కేసులుండగా ఇప్పటివరకు 18,026 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 5.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.  

 

   
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని