Published : 12 Oct 2020 19:46 IST

గంటలో.. 30కి పైగా వంటలు

రికార్డు సృష్టించిన కేరళ చిన్నారి

తిరువనంతపురం : గంట కన్నా తక్కువ సమయంలో 30 రకాలకు పైగానే వంటలు చేసిన కేరళకు చెందిన పదేళ్ల శాన్వీ రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పర్యవేక్షకులు ఆధ్వర్యంలో చిన్నారి వంటలు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా గంటలో శాన్వీ 30 రకాల వంటలు చేసినట్లు అక్కడే ఉండి పర్యవేక్షించిన ఇద్దరు గెజిటెడ్‌ అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘనతతో ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో పేరు సంపాదించారు. 

కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన శాన్వీ గంటలో చికెన్‌రోస్ట్‌, ఫ్రైడ్‌రైస్‌, ఇడ్లీ, ఊతప్పం ఇలా 30కి పైగా వంటలు గంట సమయంలో చేయగలరు. తన తల్లి మంజిమ స్టార్‌ చెఫ్‌ కావడంతో వంటలపై తనకు ఇష్టం ఏర్పడినట్లు శాన్వీ చెప్పారు. ఆమె దగ్గరి నుంచే స్పూర్తి పొంది ఈ రికార్డులు సాధించినట్లు తెలిపారు. చిన్నారులు పోటీ పడే ఓ వంటల కార్యక్రమంలోనూ శాన్వీ పాల్గొని విజయం సాధించినట్లు మంజిమ తెలిపారు. తన పేరు మీద యూట్యూబ్‌ ఛానల్ నడుపుతున్న చిన్నారి కొత్త కొత్త వంటలతో తన ఫాలోవర్స్‌ను పలకరిస్తుంటారు.

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని