Jobs: ‘పది’తో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1,226 ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పలు జిల్లాల కోర్టుల్లో మొత్తంగా 1226 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు హైకోర్టు తెలిపింది.

Updated : 04 Jan 2023 22:02 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని జిల్లాల కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌(Job notification) విడుదలైంది. జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana High court) నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. హాల్‌ టిక్కెట్లను ఫిబ్రవరి 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను మార్చి నెలలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

అభ్యర్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే ఈ పరీక్షకు అనర్హులని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు. 2022 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. ఈ ఉద్యోగంలో నెలకు వేతనం రూ.19వేలు నుంచి రూ.58,850వరకు చెల్లించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వూ తదితర అంశాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని