Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
ఉన్నట్టుండి నది ప్రవాహం పెరిగిపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు పెట్టారు. వరద ఉద్ధృతికి అక్కడ పార్క్ చేసి ఉంచిన 14 కార్లు కొట్టుకుపోయాయి.........
భోపాల్: ఉన్నట్టుండి నది ప్రవాహం పెరిగిపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు పెట్టారు. వరద ఉద్ధృతికి అక్కడ పార్క్ చేసి ఉంచిన 14 కార్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ ప్రాంతంలో జరిగింది. ఇండోర్ జిల్లాకు చెందిన దాదాపు 50 మంది పర్యాటకులు కట్కూర్ అటవీ ప్రాంతంలోని సుక్డీ నది పరివాహక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. వారంతా అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తుండగా.. ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగిపోయింది. దీన్ని గమనించిన పర్యాటకులు ప్రాణభయంతో కొద్దిదూరంలో ఎత్తుగా ఉన్న ప్రాంతానికి పరుగులు తీశారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ వారు పార్క్ చేసి ఉంచిన 14 కార్లు ఆ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. వాటిల్లో ఖరీదైన ఎస్యూవీ కార్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఆ కార్లను స్థానిక గ్రామస్థుల సాయంతో వెతుకుతున్నట్లు ఏఎస్పీ జితేంద్రసింగ్ పవార్ వెల్లడించారు. వాటిల్లో కొన్ని కార్లను గుర్తించామని, వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..