యూకే రిటర్న్స్‌: 18మంది కేరళవాసులకు కరోనా

బ్రిటన్‌ నుంచి కేరళకు వచ్చిన 18మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్లు కేరళ ఆరోగ్యమంత్రి కేకే శైలజ మంగళవారం వెల్లడించారు.

Updated : 27 Feb 2024 19:23 IST

తిరువనంతపురం: బ్రిటన్‌ నుంచి కేరళకు వచ్చిన 18మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్లు కేరళ ఆరోగ్యమంత్రి కేకే శైలజ మంగళవారం వెల్లడించారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో భారత్‌లో బ్రిటన్‌ నుంచి వచ్చిన వారి కొవిడ్‌ పాజిటివ్‌ కావడం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణీకులందర్నీ హోంఐసోలేట్‌ చేసినట్లు శైలజ తెలిపారు. ఇప్పటికే భారత్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ ప్రవేశించడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇంతకు ముందు బ్రిటన్‌ నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌ రావడంతో వారందరి నమూనాల్ని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపామని ఆమె తెలిపారు. భారత్‌లో ఇప్పటికే ఆరు కరోనా పాజిటివ్‌ కేసుల్లో మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. ఈ కొత్త రకం కరోనా వైరస్‌ త్వరగా సంక్రమించే స్వభావం ఉండటంతో వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కేరళలో ఉన్న నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని ఆమె తెలిపారు. 

ఇవీ చదవండి..

కొత్తరకంపై ఆందోళన వద్దు: సీసీఎంబీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని