Published : 09/12/2021 17:25 IST

Sajjanar: ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు సజ్జనార్ బంపర్‌ ఆఫర్‌!

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు సంస్థ ఎండీ సజ్జనార్ జన్మదిన కానుక ప్రకటించారు. జీవితకాలం వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా 'లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్' ఇచ్చినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో.. పెద్దకొత్తపల్లి సమీపంలో నవంబర్ 30న ఓ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. డిసెంబర్ 7న సిద్దిపేట సమీపంలో ఆసిఫాబాద్ డిపో బస్సులో మరో మహిళ కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ ఇద్దరు మహిళలు వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేలోగా.. ఆర్టీసీ సిబ్బంది సాయంతో పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో పుట్టిన ఈ ఇద్దరు పిల్లలకు కానుకగా.. ఉచిత జీవితకాల పాస్‌లను మంజూరు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా సజ్జనార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Read latest General News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని