Climate Change: 2016, 2009, 2017, 2010 తర్వాత 2021లోనే అత్యధికం

1901 నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదో ఏడాదిగా 2021 నిలిచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Published : 15 Jan 2022 01:46 IST

ప్రకృతి వైపరిత్యాలకు గతేడాది 1750 మంది మృతి

దిల్లీ: 1901 నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదో ఏడాదిగా 2021 నిలిచిందని భారత వాతావరణ కేంద్రం (ఐఎమ్‌డీ) తెలిపింది. ఈ మేరకు 2021 వాతావరణ పరిస్థితులపై ఐఎమ్‌డీ ఒక నివేదిక విడుదల చేసింది. గడిచిన ఏడాదిలో వార్షిక సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.44 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. అంతేకాకుండా తుపానులు, వరదలు, పిడుగుల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా.. దేశంలో  మొత్తం 1,750 మంది మృతి చెందినట్లు తెలిపింది. వీటిలో 787 మంది పిడుగుల కారణంగా, 759 మంది అధిక వర్షాల వల్ల, 172 మంది తుపానులు, 32 మంది అధిక ఉష్ణోగ్రతల వల్ల మృతి చెందినట్లు వెల్లడించింది.

‘‘1901 నుంచి నమోదైన ఉష్ణోగ్రతలో పోలిస్తే 2016, 2009, 2017, 2010 తర్వాత 2021లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణం కన్నా 0.710 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది.  2009లో 0.550 డిగ్రీల సెల్సియస్‌, 2017లో 0.541 డిగ్రీల సెల్సియస్‌, 2010లో 0.539 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి’’ అని ఐఎమ్‌డీ నివేదికలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని