చిన్నారిని ఎగరేసుకుపోయిన గాలిపటం

తైవాన్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని..

Updated : 01 Sep 2020 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని ఓ గాలిపటం అమాంతం గాల్లోకి ఎగరేసుకుపోయింది. తైవాన్‌లోని సించు నగరంలో ఏటా పతంగుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తాజాగా జరిగిన వేడుకలో పలువురు పాల్గొన్నారు. అయితే గాల్లో ఎగురుతూ వచ్చిన ఓ భారీ గాలిపటం తోక ఉత్సవానికి వచ్చిన ఓ చిన్నారి చేతికి చుట్టుకొని ఆమెను అమాంతం ఆకాశంలోకి తీసుకెళ్లిపోయింది. 100 అడగులకు పైగా ఎత్తులోకి ఎగరేసుకుపోయింది. దాదాపు 30 సెకన్లపాటు చిన్నారిని గాల్లోనే గింగిరాలు తిప్పింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పర్యాటకులు గాలిపటాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి ఆ చిన్నారిని కిందకు దింపారు. కాగా ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ప్రాంతంలో వచ్చే భారీ ఈదురు గాలుల కారణంగానే వేగంగా వచ్చిన భారీ గాలిపటం ధాటితో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి స్పల్ప గాయాలతో బయటపడ్డట్లు పేర్కొన్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని