నెటిజన్లను మెప్పిస్తోన్న చిన్నారి

ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించింది నాగాలాండ్‌కు చెందిన మూడేళ్ల లిపావి

Published : 05 Jun 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించింది నాగాలాండ్‌కు చెందిన మూడేళ్ల లిపావి. తనకు జలుబు చేయడంతో ఎవరి సాయం లేకుండా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్‌ చేయించుకుంది. జున్హెబోటో జిల్లాలోని ఘతషి తాలూకాలో హెబోలిమి ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. లిపావి అమ్మానాన్నలు పొలం పనులకు వెళ్లడంతో తన ఇంటికి కొద్దిదూరంలోనే ఉన్న ఆరోగ్య కేంద్రానికి తానే స్వయంగా చెకప్‌ చేయించుకోవడానికి వెళ్లింది. లిపావిని చూసి అక్కడి ఆరోగ్య సిబ్బంది ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న వైద్యులు చిన్నారిని పరీక్షించి జాగ్రత్తగా ఇంటికి పంపించారు. వైద్యురాలు చిన్నారి లిపావిని చెకప్‌ చేస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది. స్వయంగా ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన చిన్నారి బాధ్యతగా వ్యవహరించిందని, పెద్దవాళ్లకు కూడా ఆదర్శంగా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని