చిన్నారి.. భలే చలాకీ 

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో జ్ఞానసాయికి చోటు

Published : 07 Jun 2021 23:41 IST

                                       
దేశాలు, రాష్ట్రాల రాజధానులు అడిగితే... గడగడ చెప్పేస్తుంది. రైమ్స్ , తెలుగు పద్యాలనూ గబగబా అప్పచెబుతుంది. మాటల పుట్టగా పేరు తెచ్చుకున్న మూడేళ్ల ఒంగోలు పాప.... ఇండియా బుక్  ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.

రాష్ట్రాలు, దేశాలు రాజధానులు అడిగితే అవలీలగా చెప్పేస్తున్న ఈ పాపపేరు జ్ఞానసాయి. ఒంగోలుకు చెందిన చక్రవర్తి, దీప్తిల రెండో కుమార్తె. వయస్సు 3ఏళ్ల రెండు నెలలు. ఇప్పుడిప్పుడే చిలుకపలుకులు పలికే చిరుప్రాయం అది. అలాంటిది తనకున్న ప్రతిభతో రాజధానుల పేర్లు, రైమ్స్‌, తెలుగుపద్యాలు, గడగడా చెప్పేస్తోంది. పాప పేరును ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు తల్లిదండ్రులు పంపగా, ఆ జ్యూరీ ఆన్‌లైన్‌ ద్వారా పెట్టినపరీక్షను నెగ్గింది. వారి ప్రశంసలు, ధ్రువపత్రాన్ని పొందింది. ఏదైనా చెబితే వెంటనే అప్పజెప్పే చలాకీతనం చూసి ఆమెకు తర్ఫీదునిచ్చామని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.

తక్కువ టైంలో నేర్చుకుంది - చక్రవర్తి, జ్ఞానసాయి తండ్రి
ఒకసారి చిన్న ట్రయల్‌ ఏర్పాటు చేద్దామని చెప్పి పెయింటింగ్‌ పోటీలో పాల్గొనేలా చేశాం. అదీ రెండేళ్ల వయస్సులోనే. ఆ పెయింటింగ్‌ పోటీని హెచ్‌పీ కంపెనీ నిర్వహించింది.దాంట్లో పాపకు మంచి అవార్డు వచ్చింది. ఆతరువాత వేరేది ఏదైనా కసరత్తు చేద్దామని చెప్పి రాష్ట్రాలు, దేశాలు రాజధానులు చెప్పించడం మొదలుపెట్టాం. అదీ తక్కువ టైంలోనే నేర్చుకుంది. ఇదే విషయాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి తెలిపాం. వాళ్లు మమల్ని వీడియో పెట్టమన్నారు.ఆ తరువాత ఆన్‌లైన్‌లో జడ్జిలు, జ్యూరీ నిర్వహించి ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు.

ఒక్కసారి చెబితే చాలు- దీప్తి, తల్లి
చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి చెప్పగానే ఏదైనా నేర్చుకుంటుంది. ట్రెయినింగ్‌ అంటే పాప ఆడుకునేటప్పుడు, ఫ్రీగా ఉండేటప్పుడే చెబుతాను. ఇంకా ప్రత్యేకించి మరీ ఏం ఒత్తిడి తీసుకురాను. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని