Anantapur: అనంతపురం జిల్లా.. ఒకే గ్రామంలో 31 మందికి అస్వస్థత

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు.

Published : 11 May 2023 13:45 IST

రాయదుర్గం: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో కరియమ్మ (75) అనే వృద్ధురాలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాన్ని సందర్శించిన గ్రామీణ నీటి సరఫరా, వైద్య శాఖ అధికారులు తాగునీటిలో ఎటువంటి సమస్య లేదని తేల్చి చెబుతున్నారు. అయితే గంటగంటకు కేసులు పెరుగుతుండటంతో ఏం చేయాలో తోచక గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. 

గ్రామంలోని బీసీ కాలనీ కింది వీధిలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ ప్రాంతానికి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కుళాయిల చుట్టూ రెండు మూడు అడుగుల మేర గుంతలు తవ్వుకున్నారు. ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరద నీరు కుళాయిల్లో ఇంకిపోయింది. సోమవారం యథావిధిగా తాగునీటిని సరఫరా చేశారు. ఈ విషయాన్ని గమనించకుండా ఆ నీటిని తాగడంతోనే గ్రామస్థులకు వాంతులు, విరేచనాలవుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని