ఈ చేపలతో జాలర్లకు కాసుల పంట.. కిలో ₹13వేలు!

అత్యంత అరుదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. మంగళవారం 10మంది జాలర్లు సముద్రంలో .......

Updated : 28 Oct 2021 04:46 IST

దిఘా‌: బెంగాల్‌లోని దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత అరుదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. మంగళవారం 10 మంది జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు ఏకంగా 33 తెలియా భోలా చేపలు చిక్కాయి. దీంతో తమ సంఘం కార్యాలయం వద్ద వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ.1.40 కోట్ల ధర పలికాయి.

వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని తూర్పుమేదినీపూర్‌ జిల్లా దిఘా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా వారి వలకు ఈ అరుదైన రకానికి చెందిన భారీ చేపలు చిక్కాయి. ఒక్కో చేప బరువు 33 నుంచి 35కిలోల వరకు ఉన్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపల్ని మెడికల్‌ క్యాప్సూల్స్‌ కవర్ల తయారీలో వాడటంతో వీటికి భారీ గిరాకీ ఉంటుంది. వీటి కోసం కొనుగోలుదారులు ఎగబడుతుంటారు. తమకు దొరికిన చేపల్ని వేలం వేయగా.. ఓ ఫార్మా కంపెనీ మొత్తం చేపల్ని దాదాపు రూ.1.4కోట్లకు కొనుగోలు చేసినట్టు మత్స్యకారులు వివరించారు. మొత్తం చేపల్ని కిలో రూ.13వేలకు చొప్పున విక్రయించినట్టు తెలిపారు. ఈ రకం చేపలు ఒక పట్టాన జాలర్లకు వలకు చిక్కవని, నడి సముద్రంలో సమూహాలుగా తిరుగుతాయని, కొన్నిసార్లు సమూహాల నుంచి విడిపోయినప్పుడు మాత్రమే ఇలా వలకు చిక్కుతాయని వివరించారు. ఈ చేపకు ఉన్నంత డిమాండ్‌ వీటి గుడ్లకు ఉండదని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని